Adivi Sesh : హిట్ 2 త్వరలో హిందీలో కూడా.. అడివి శేష్ మరో పాన్ ఇండియా సినిమా..

అడివి శేష్ మాట్లాడుతూ.. ''హిట్ 2 సినిమా తెలుగులో డిసెంబర్ 2నే విడుదల అవుతుంది. ముందు తెలుగు సినిమాగానే రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ టీజర్, ట్రైలర్ కి బాలీవుడ్ లో కూడా............

Adivi Sesh : హిట్ 2 త్వరలో హిందీలో కూడా.. అడివి శేష్ మరో పాన్ ఇండియా సినిమా..

 

Adivi Sesh : నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా హిట్ 2 సినిమా రాబోతుంది. మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా ఉండబోతుంది. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అడవిశేష్ సినిమా గురించి మాట్లాడారు. అడివిశేష్ గత సినిమా మేజర్ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయి భారీ విజయం సాధించడంతో బాలీవుడ్ లో కూడా అడివి శేష్ కి మార్కెట్ ఏర్పడింది. దీంతో హిట్ 2 సినిమాని బాలీవుడ్ లో రిలీజ్ చేస్తారా అని అంతా అడుగుతున్నారు. దీనిపై అడివిశేష్ స్పందించారు.

Shriya Saran : మా ఆయనకి నేను ముద్దు పెడితే తప్పేంటి?

అడివి శేష్ మాట్లాడుతూ.. ”హిట్ 2 సినిమా తెలుగులో డిసెంబర్ 2నే విడుదల అవుతుంది. ముందు తెలుగు సినిమాగానే రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ టీజర్, ట్రైలర్ కి బాలీవుడ్ లో కూడా మంచి ఆదరణ లభించింది. అలాగే సస్పెన్స్ సినిమా అయిన దృశ్యం 2 కూడా పెద్ద హిట్ అయింది బాలీవుడ్ లో. అందుకే హిట్ 2 సినిమాని కూడా బాలీవుడ్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. కాకపోతే కొంచెం సమయం తీసుకుంటాం. ఇక్కడ తెలుగులో రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత బాలీవుడ్ లో రిలీజ్ చేస్తాం” అని తెలిపారు. అలాగే నేను అన్ని భాషల్లో సినిమాలు చేస్తాను. తెలుగు, హిందీ ఏ సినిమా చేసినా తెలుగువాడిగానే చేస్తాను అని అన్నారు.