Adivi Sesh : రిచా పెట్టిన ట్వీట్ నన్ను చాలా బాధపెట్టింది..

శేష్ నటించిన హిట్ 2 సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రిచా చద్దా చేసిన ట్వీట్ పై స్పందించాడు శేష్. దీనిపై శేష్ మాట్లాడుతూ...............

Adivi Sesh : రిచా పెట్టిన ట్వీట్ నన్ను చాలా బాధపెట్టింది..

Adivi Sesh :  ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఓ ప్రకటన చేయగా దీనికి బాలీవుడ్ భామ రిచా చద్దా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘గాల్వాన్ సేస్ హాయ్’ అని ట్వీట్ చేసింది. దీంతో ఆమె చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా దుమారం లేపింది.

భారతదేశం మరియు చైనాల మధ్య 2020 గాల్వాన్ ఘర్షణలో భారత జవాన్ల త్యాగాన్ని ఎగతాళి చేసేలా ఆమె ట్వీట్ ఉందంటూ, ఆర్మీని అవమానపరుస్తుందంటూ నెటిజెన్లతో సహా పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఫైర్ అయ్యారు. హీరోయిన్ ప్రణీత, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మంచు విష్ణు.. ఇలా పలువురు స్టార్ సెలబ్రిటీలు సైతం రిచా చద్దా ట్వీట్ కి కౌంటర్ ఇచ్చారు. పలువురు ఆమెపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేశారు.

L Vijayalakshmi : పుష్ప హీరో ఎవరో తెలీదు.. సీనియర్ హీరోయిన్ వ్యాఖ్యలు..

తాజాగా దీనిపై అడివి శేష్ స్పందించాడు. శేష్ నటించిన హిట్ 2 సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రిచా చద్దా చేసిన ట్వీట్ పై స్పందించాడు శేష్. దీనిపై శేష్ మాట్లాడుతూ.. ”రిచా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారగా ఓ విలేఖరి నాకు ఫోన్ చేసి దానిపై మీ అభిప్రాయం ఏంటని అడిగాడు. అప్పటిదాకా నేను ఆ ట్వీట్ కూడా చూడలేదు. అతను చెప్పిన తర్వాతే ఆ ట్వీట్ చూశాను. ఆమె ఏ ఉద్దేశంతో ఆ ట్వీట్ పెట్టిందో నాకు తెలీదు కానీ, మేజర్ సినిమా సమయంలో సైనికుల కష్టాలని చాలా దగ్గర్నుండి చూశాను.అలాంటిది ఆమె సైనికుల గురించి అలా ట్వీట్ చేయడం నన్ను చాలా బాధపెట్టింది” అని తెలిపాడు.