Major Teaser : దేశాన్ని ప్రేమించడం అందరి పని.. వాళ్లని కాపాడడం సోల్జర్ పని..

26/11 ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం.. ‘మేజర్’. అడివి శేష్ సందీప్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ‘గూఢచారి’ ఫేం శశి కిరణ దర్శకత్వంలో, సూపర్‌స్టార్ మహేష్ బాబు GMB Entertainment బ్యానర్‌తో కలిసి ఏ ప్లస్ ఎస్, సోనీ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

Major Teaser : దేశాన్ని ప్రేమించడం అందరి పని.. వాళ్లని కాపాడడం సోల్జర్ పని..

Major Teaser

Major Teaser: 26/11 ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం.. ‘మేజర్’. అడివి శేష్ సందీప్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ‘గూఢచారి’ ఫేం శశి కిరణ దర్శకత్వంలో, సూపర్‌స్టార్ మహేష్ బాబు GMB Entertainment బ్యానర్‌తో కలిసి ఏ ప్లస్ ఎస్, సోనీ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

Major

ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం ‘మేజర్’ టీజర్ వదిలారు. తెలుగు, మహేష్ బాబు, హిందీ, సల్మాన్ ఖాన్, మలయాళం టీజర్స్ పృథ్వీరాజ్ రిలీజ్ చేశారు. మేజర్ సందీప్ క్యారెక్టర్ కోసం అడివి శేష్ అద్భుతంగా మేకోవర్ అవడమే కాకుండా, ఈ టీజర్‌లో వన్ మేన్ షో అనేలా ఆకట్టుకున్నారు.

‘‘దేశాన్ని ప్రేమించడం అందరి పని.. వాళ్లని కాపాడడం సోల్జర్ పని’’.. అంటూ శేష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. విజువల్స్, ఆర్ఆర్, యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ అయ్యాయి.. 26/11 ముంబై దాడులను కళ్లకు కట్టేలా, ప్రతి భారతీయుడికి రోమాలు నిక్కబొడుచుకునేలా తెరకెక్కించారని టీజర్ చూస్తే అర్థమవుతోంది. సినిమాపై అంచనాలు పెంచేసింది ‘మేజర్’ టీజర్..

శోభితా ధూళిపాళ్ల కథానాయిక.. సయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ తెరకెక్కుతున్న ‘మేజర్’ చిత్రాన్ని మలయాళంలోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్‌ప్లే : అడవి శేష్, స్క్రిప్ట్ గైడెన్స్, డైలాగ్స్ : అబ్బూరి రవి, హిందీ డైలాగ్స్ : అక్షత్ అజయ్ శర్మ, కెమెరా : వంశీ పచ్చిపులుసు, సంగీతం : శ్రీ చరణ్ పాకాల.