Covid cases: భారత్‌లో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నాలుగు వారాలుగా పెరుగుతూ వచ్చిన కరోనా కేసుల సంఖ్య, గతవారం దాదాపు 20 శాతం తగ్గింది.

Covid cases: భారత్‌లో తగ్గుతున్న కరోనా కేసులు

Covid Cases

Covid cases: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నాలుగు వారాలుగా పెరుగుతూ వచ్చిన కరోనా కేసుల సంఖ్య, గతవారం దాదాపు 20 శాతం తగ్గింది. ఏప్రిల్ 11 నుంచి కరోనా కేసులు పెరగడం మొదలైంది. ఈ నెల 2-8 వరకు దేశవ్యాప్తంగా 23,000కు పైగా కేసులు నమోదుకాగా, ఈ నెల 9-15 వరకు 18,500 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో గత వారం 20 శాతం కేసులు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. కోవిడ్‌తో శనివారం 34 మంది మరణించారు. అంతకుముందు రోజు ఈ సంఖ్య 20గా ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఢిల్లీలో కేసుల సంఖ్య 34 శాతం తగ్గింది.

Telangana Covid Update News : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులు అంటే

హర్యాణా, ఉత్తర ప్రదేశ్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతుండటం వల్ల ఈ సారి తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 44 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 44 శాతం, మధ్యప్రదేశ్‌లో 31 శాతం, బెంగాల్‌లో 8 శాతం కేసులు తగ్గాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 17,300గా ఉంది. ఇప్పటివరకు దేశంలో కోవిడ్ సోకిన వారి సంఖ్య 4,31,23,801.