Harsh Goenka: ‘అగ్నివీర్’లకు ఉద్యోగాలిస్తా: హర్ష్ గోయెంకా After Anand Mahindra, Harsh Goenka extends support to future Agniveers

Harsh Goenka: ‘అగ్నివీర్’లకు ఉద్యోగాలిస్తా: హర్ష్ గోయెంకా

ఆర్‌పీజీ సంస్థ ‘అగ్నివీర్’లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా మాతోపాటు (ఆనంద్ మహీంద్రాతో కలిపి) చేరుతాయనుకుంటున్నా. మన యువత భవిష్యత్తు కోసం ఈ హామీ ఇవ్వాలి అని హర్ష్ గోయెంకా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Harsh Goenka: ‘అగ్నివీర్’లకు ఉద్యోగాలిస్తా: హర్ష్ గోయెంకా

Harsh Goenka: ‘అగ్నిపథ్’ స్కీం ద్వారా ఎంపికైన అగ్నివీర్‌లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరో పారిశ్రామిక వేత్త చేరారు. ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ చైర్మన్ హర్ష్ గోయెంకా కూడా ‘అగ్నివీర్’లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు.

Agniveer: అగ్నివీర్ నోటిఫికేషన్ జారీ.. జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

ఈ మేరకు సోమవారం ట్విట్టర్‌లో ప్రకటన చేశారు. ‘‘ఆర్‌పీజీ సంస్థ ‘అగ్నివీర్’లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా మాతోపాటు (ఆనంద్ మహీంద్రాతో కలిపి) చేరుతాయనుకుంటున్నా. మన యువత భవిష్యత్తు కోసం ఈ హామీ ఇవ్వాలి’’ అని హర్ష్ గోయెంకా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తెలంగాణతోపాటు, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బిహార్, హరియాణా వంటి రాష్ట్రాల్లో ‘అగ్నిపథ్’ స్కీంకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని రద్దు చేయలని కోరుతూ యువత ఆందోళన చేస్తోంది. ఈ పథకంలో చేరడం వల్ల తమ భవిష్యత్తుకు రక్షణ లేకుండా పోతుందని యువత భావిస్తోంది. నాలుగేళ్ల తర్వాత తమ భవిత ఏంటని ప్రశ్నిస్తోంది.

Narendra Modi: సంస్కరణలు కష్టంగానే ఉంటాయి కానీ..: మోదీ

ఈ నేపథ్యంలో ‘అగ్నివీర్’లుగా చేరిన యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆనంద్ మహీంద్రా, హర్ష్ గోయెంకా వంటి కార్పొరేట్లు ముందుకొస్తున్నారు. తాజాగా అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

×