Maha Crisis: మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్, రాజస్థాన్ ఇక త్వరలో బెంగాల్ కూడా.. – అధికారి

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం తర్వాత జార్ఖండ్, రాజస్థాన్ లు అదే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని, త్వరలో వెస్ట్ బెంగాల్ కు కూడా ముప్పు తప్పదని చెప్తున్నారు బీజేపీ లీడర్ సువెందు అధికారి.

Maha Crisis: మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్, రాజస్థాన్ ఇక త్వరలో బెంగాల్ కూడా.. – అధికారి

Maha Crisis

Maha Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం తర్వాత జార్ఖండ్, రాజస్థాన్ లు అదే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని, త్వరలో వెస్ట్ బెంగాల్ కు కూడా ముప్పు తప్పదని చెప్తున్నారు బీజేపీ లీడర్ సువెందు అధికారి.

మహారాష్ట్రలోని అధికారి పార్టీ శివసేనకు చెందిన పలువురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు అస్సాంలో క్యాంపులు వేశారు. ఎంవీఎ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయం చెప్పిన సువేందు అధికారి.. బెంగాల్‌లో TMC నేతృత్వంలోని ప్రభుత్వం కూడా ఇదే విధమైన పరిస్థితి ఎదుర్కొంటుందని త్వరలోనే అది జరుగుతుందని సోమవారం పేర్కొన్నారు.

మహారాష్ట్ర తర్వాత బీజేపీయేతర రాష్ట్రాలైన జార్ఖండ్, రాజస్థాన్‌లు వరుసలో ఉన్నాయని, ఆ తర్వాత బెంగాల్ వంతు వస్తుందని కూడా అధికారి కామెంట్ చేశారు. అతని వ్యాఖ్యలపై TMC నుంచి ధీటైన రెస్పాన్స్ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి గురైన కాషాయ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి “తీవ్రమైన ప్రయత్నాలు” చేస్తోందని విమర్శించారు.

Read Also: సుప్రీంకోర్టు‎కు మహారాష్ట్ర సంక్షోభం

కూచ్ బెహార్ జిల్లాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి అధికారి మాట్లాడుతూ, “మొదట, మహారాష్ట్రలో పరిస్థితిని పరిష్కరించనివ్వండి. ఆ తర్వాత జార్ఖండ్, రాజస్థాన్ ల సంగతి చూద్దాం. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌ వంత కూడా వస్తుంది. TMC కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటారు. ఈ ప్రభుత్వం 2024 నాటికే అధికారం కోల్పోతుంది. 2026 వరకు ఉండదు” అంటూ కామెంట్ చేశారు.

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వ్యతిరేకమైన మూవ్ కదిపిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సోమవారం 9మంది మంత్రుల శాఖలను తొలగించారు. అసమ్మతి ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది జూలై 11 వరకు వారిపై అనర్హత ప్రక్రియను నిలిపివేసింది అగ్ర న్యాయస్థానం.