భారతదేశంలో త్వరలో భారీ భూకంపం ?

  • Published By: madhu ,Published On : June 5, 2020 / 05:44 AM IST
భారతదేశంలో త్వరలో భారీ భూకంపం ?

భారతదేశాన్ని వరుస భూంకపాలు వణికిస్తున్నాయి. దీనిపై NCS శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020, జూన్ 05వ తేదీ శుక్రవారం ఉదయం కర్నాటక, జార్ఖండ్ లో భూమి కంపించింది. ఏపీలో ని ప్రకాశం జిల్లా ఒంగోలులో భూ ప్రకంపనాలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉదయం 10.15 గంటలకు స్వల్పంగా భూమి కంపించింది. ఏమై పోతుందోనన్న భయం వారిలో వెంటాడిది. రోడ్లపైకి ప్రజలు పరుగులు తీశారు. కానీ ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ..భవిష్యత్ ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందనే ఆందోళన నెలకొంది. 

రెండు నెలల్లో దేశ రాజధాని ఢిల్లీలో 14 సార్లు భూ ప్రకంపనాలు వచ్చిన సంగతి తెలిసిందే. రెండు మాత్రమే 3.5 కన్నా అధిక తీవ్రత రికార్డ్ అయ్యింది. త్వరలో భారీ తీవ్రతతో భూకంపం వస్తుందని భూ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. హిమాలయాల్లో సంభవించే..భూకంపాలతో ఉత్తరాది రాష్ట్రాలపై ప్రభావం పడనుందని అంచనా వేస్తున్నారు.

భూకంప ప్రభావం వల్ల విపత్తు సంభవించే ప్రమాదం ఉందని జమ్మూలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొ. చందన్ ఘోష్ అంచనా వేస్తున్నారు. కానీ..భూకంపం ఎప్పుడు వస్తుందో ? ఎక్కడ వస్తుందో ఖచ్చితంగా అంచనా వేయలేమని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆకాశం తాకిందా అన్నట్లుగా పెద్ద పెద్ద భవనాలు ఉండడం వల్ల భారీ నష్టం వాటిల్లుతుందని వెల్లడిస్తున్నారు. Seismic Hazard Microzonation అధ్యయనం ప్రకారం..యమునా నది చుట్టుపక్కల ప్రాంతాల కంటే..దక్షిణ మధ్య ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు సురక్షితమైనవిగా అంచనా వేస్తున్నారు. 

ఓ వైపు కరోనా వైరస్ ముప్పుతిప్పలు పెడుతుంటే..తాజాగా వస్తున్న భూ ప్రకంపనాలు అందర్నీ కలవరపెడుతోంది. భూకంపం సంభవించిన ప్రతిసారి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానాలోని గుర్ గావ్..ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ లో భూకంప తీవ్రత నమోదైంది.

చంద్రగ్రహణం వేళ వరుసగా భూకంపాలు వస్తుండడంతో అందరిలోనూ భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. శుక్రవారం ఉదయం 6.55 నిమిషాలకు కర్నాటకలోని చారిత్రాత్మక ప్రదేశం హంపిలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. అదే సమయంలో జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ లో భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.7గా నమోదైంది. యాదృచ్చికమైనా..ఏకకాలంలో భూకంపాలు సంభవించడంతో భూగర్భ శాస్త్రవేత్తలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి గల కారణాలపై పరిశోధన చేస్తున్నారు. 

Read: ఒంగోలులో కంపించిన భూమి.. తీవ్రత 4.7గా నమోదు