Kaali : ‘కాళి’ డాక్యుమెంటరీ పోస్టర్ పై క్షమాపణలు చెప్పిన అగాఖాన్ మ్యూజియం.. మరింత రెచ్చగొట్టేలా డైరెక్టర్ పోస్ట్..

టొరంటో మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం తరపున ఈ ఫిలిం ఫెస్టివల్ ని నిర్వహిస్తున్న అగాఖాన్ మ్యూజియం హిందువులకు క్షమాపణలు చెప్తూ ఓ నోట్ ని విడుదల చేసింది. ఇందులో..............

Kaali : ‘కాళి’ డాక్యుమెంటరీ పోస్టర్ పై క్షమాపణలు చెప్పిన అగాఖాన్ మ్యూజియం.. మరింత రెచ్చగొట్టేలా డైరెక్టర్ పోస్ట్..

Kaali Poster

Kaali :  ఇటీవల కెనడాలోని టొరంటోలో జరుగుతున్న అగాఖాన్ మ్యూజియం ఫిలిం ఫెస్టివల్ లో భారతదేశానికి చెందిన ఓ లేడీ డైరెక్టర్ కాళీ అనే ఒక సినిమాని ప్రదర్శించనున్నారు. అయితే దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది డైరెక్టర్ లీనా మణిమేఖలై. ఆ పోస్టర్ లో కాళీ మాత సిగరెట్ తాగుతూ, LGBT కమ్యూనిటీ జెండా పట్టుకొని ఉండటంతో ఈ పోస్టర్ వివాదంగా మారింది. భారతదేశంతో పాటు వివిధ దేశాల్లోని హిందూ సంఘాలు ఈ పోస్టర్ పై ధ్వజమెత్తారు.

ఈ పోస్టర్ ని తీసేయాలని, ఆ డాక్యుమెంటరీని ఆపేయాలని, డైరెక్టర్ ని అరెస్ట్ చేయాలని పలువురు హిందూ సంఘాలు ఆరోపించారు. అలాగే పోలీస్ స్టేషన్స్ లో ఆమెపై ఫిర్యాదులు చేశారు. దేశ వ్యాప్తంగా ఈ పోస్టర్ పెద్ద దుమారమే లేపింది. #ArrestLeenaManimekalai అంటూ ఆ డైరెక్టర్ ని అరెస్ట్ చేయాలని ట్విట్టర్‌లో ట్రెండ్ కూడా చేశారు. అలాగే కెనడాలోని హిందూ సంఘాలు కూడా ఆందోళనలు చేశాయి. అక్కడి భారత కమిషన్ కెనడా ప్రభుత్వానికి దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతూ లేఖని విడుదల చేసింది.

Gautam Raju : ఎడిటర్ గౌతంరాజుకి నివాళులు అర్పిస్తూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్..

దీంతో టొరంటో మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం తరపున ఈ ఫిలిం ఫెస్టివల్ ని నిర్వహిస్తున్న అగాఖాన్ మ్యూజియం హిందువులకు క్షమాపణలు చెప్తూ ఓ నోట్ ని విడుదల చేసింది. ఇందులో..”టొరంటో మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం విభిన్న జాతి మరియు సాంస్కృతిక నేపథ్యాల విద్యార్థులను ఒకచోట చేర్చి, ప్రతి విద్యార్థి కెనడియన్ బహుళ సాంస్కృతికతలో భాగంగా ‘అండర్ ది టెన్త్’ ప్రాజెక్ట్ కోసం వారి వ్యక్తిగత ఆలోచనలని తెరకెక్కించారు. ఈ ప్రాజెక్ట్ ప్రదర్శనను అగాఖాన్ మ్యూజియంలో నిర్వహించడంతో పాటు కళల ద్వారా సాంస్కృతిక అవగాహన మరియు సంభాషణలను పెంపొందించడం దీని లక్ష్యం. వైవిధ్యమైన మతపరమైన వ్యక్తీకరణలు మరియు విశ్వాస సంఘాలను గౌరవించడం కూడా ఈ మిషన్‌లో అంతర్భాగంగా ఉంది. అయితే ‘అండర్ ది టెన్త్’లోని 18 చిన్న వీడియోలలో ఒకటి, దానికి సంబంధించిన పోస్టర్ హిందూ మరియు ఇతర విశ్వస సంఘాలని కించపరిచినందుకు తీవ్రంగా చింతిస్తున్నాము. వారికి మా క్షమాపణలు” అని పోస్ట్ చేసింది.

ఈ క్షమాపణలతో వివాదం సద్దుమణుగుతుంది అనుకుంటే ఆ డాక్యుమెంటరీ డైరెక్టర్ లీనా మణిమేకలై ఈ విమర్శలపై స్పందిస్తూ మరో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో.. ”ఒక సాయంత్రం కాళీ దర్శనమిచ్చి టొరంటో వీధుల్లో షికారు చేస్తున్నప్పుడు జరిగే సంఘటనల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ చిత్రాన్ని చూస్తే లీనా మణిమేకలైని అరెస్ట్ చేయండి అనే హ్యాష్‌ట్యాగ్‌ని పెట్టకండి. లవ్ యు లీనా మణిమేకలై అనే హ్యాష్‌ట్యాగ్‌ని పెట్టండి అంటూ” పోస్ట్ చేసింది. దీంతో మరోసారి రెచ్చగొట్టేలా పోస్ట్ చేయడంతో మళ్ళీ వివాదం పెద్దదిగా మారుతుంది.