మీరే ‘ఆహా’.. మీదే ‘ఆహా’..

మీరే ‘ఆహా’.. మీదే ‘ఆహా’..

Aha: ట్రెండ్‌కి తగ్గట్టు వెబ్ సిరీస్‌లు, బ్లాక్‌బస్టర్ మూవీస్‌తో ప్రేక్షకులకు 100 శాతం తెలుగు కంటెంట్ అందిస్తూ.. ప్రారంభించిన ఏడాదిలోపే అందరితో ‘ఆహా’ అనిపించుకుంటోంది. తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’.. గతేడాది ఫిబ్రవరిలో టెస్ట్ లాంచ్ అయిన ‘ఆహా’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు.

Aha

రోజురోజుకీ ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది ‘ఆహా’. ఇటీవల పలు భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలతో పాటు మంచి వెబ్ సిరీస్అందిస్తూ ఆడియెన్స్‌‌ను ఎంటర్‌టైన్ చేస్తున్న ‘ఆహా’ ప్రారంభమైన ఏడాదిలోపే అద్భుత విజయాన్ని సాధించింది. ఫిబ్రవరి 8 తో ‘ఆహా’ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టి విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి అవుతోంది.AHA

ఈ సందర్భంగా ‘ఆహా’ ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ‘‘ప్రారంభించిన అతితక్కువ సమయంలోనే ‘ఆహా’ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో గేమ్ ఛేంజర్‌గా నిలిచింది.. రాబోయే రోజుల్లో మరింత ఎగ్జైటింగ్ స్టఫ్‌తో మిమ్మల్ని అలరించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం.. అని మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్ జూపల్లి తెలిపారు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ఆహా’ టీంకి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు.