ప్రభుత్వ స్కూలుని వెర్టికల్ గార్డెన్‌లా మార్చేసిన ప్రిన్సిపల్..!! వావ్..ఎటు చూసినా పచ్చదనమే..!!

ప్రభుత్వ స్కూలుని వెర్టికల్ గార్డెన్‌లా మార్చేసిన ప్రిన్సిపల్..!! వావ్..ఎటు చూసినా పచ్చదనమే..!!

Ahmedabad government school  Vertical Garden: అదొక అందమైన ఆహ్లాదకరమైన ప్రభుత్వం స్కూల్. ఆ స్కూల్ ని చూస్తే అదసలు ప్రభుత్వ స్కూలా లేకా ఏదైనా గార్డెనా అనిపిస్తుంది. కరోనా కాలంలో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా స్కూళ్లు మూతపడితే… అహ్మదాబాద్ జోధపూర్ లో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ తెరిచే ఉంది. పైగా ఎలాగంటే..అది స్కూలా లేక గార్డెనా అనిపించేలా అందంగా..ఆహ్లాదకరంగా..పచ్చగా కళకళలాడుతూ కనువిందు చేస్తూ కళ్లనిండుగా కనిపిస్తోంది. ఆ స్కూల్ ప్రిన్సిపల్ కృషికి ప్రతిఫలంగా జోధపూర్ లో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ ‘వెర్టికల్ గార్డెన్’లా (నిలువుగా ఉండే తోట) మారిపోయింది.

స్కూలంతా మొక్కలు. ఎటుచూసినా పచ్చటి లతలు…రకరకాల రంగు రంగుల పువ్వులు… ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అందంతో పాటు మనకు కావాల్సిన బోలెడంత ఆక్సిజన్ కూడా నిస్తోంది. ఇలా ఆలోచించిన ఆ స్కూల్ ప్రిన్సిపల్…కృషికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. కనువిందు చేస్తోంది. మనం పుస్తకాల్లో చదివినదానికీ, ప్రాక్టికల్‌కీ చాలా తేడా ఉంటుంది కదా. ఈ తేడాను వివరించేందుకు ఆ ప్రిన్సిపల్ ఈ హ్యాంగింగ్ గార్డెన్ ఆవిష్కరించారు.

కరోనా వైరస్ రాగానే స్కూళ్లకు పిల్లలు మానేశారు. పిల్లలలో సందడి సందడిగా ఉండే స్కూల్ మొత్తం బోసిపోయింది. పిల్లల కేరింతలు లేక చిన్నబోయింది. టీచర్లకు కూడా పెద్దగా పనిలేకుండాపోయింది. దీంతో ఆ ఖాళీ సమయంలో ఈ స్కూల్ ప్రిన్సిపల్ ఈ వెర్టికల్ గార్డెన్‌ను సృష్టించారు. దీంతో పచ్చగా కళకళలాడుతూ స్కూల్ మొత్తం ఓ గార్డెన్‌లా మారిపోయింది.

ఆ స్కూలు అందాన్ని చూసిన చాలామంది అక్కడొచ్చి ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. స్కూల్ ల్లో చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 500లకుపైగా మొక్కల్ని నాటారాయన. పెద్ద మొక్కల్ని నాటారు. కరోనా తరువాత స్కూలుకు వస్తున్న పిల్లలకు ఈ గార్డెన్ ద్వారా మొక్కల పెంపకంపై ఎంతో ఆసక్తి కలుగుతోంది. పిల్లలు ఆ మొక్కలు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నీళ్లు పోస్తున్నారు. చక్కగా సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు ప్రిన్సిపల్. ఒక్కప్పుడు సాధారణంగా కనిపించే ఈ స్కూలు ఇప్పుడు పర్యావరణానికి మారుపేరులా కనిపిస్తోంది.

ఈ వెర్టికల్ గార్డెన్ కోసం ప్లాస్టిక్ బాటిళ్లు, కేన్లు ఇతరత్రా పారేసే వస్తువులనే వాడి ఇంత అందానికి రూపమిచ్చారు ప్రిన్సిపల్. అహ్మదాబాద్‌లో పూర్తిగా వెర్టికల్ గార్డెన్‌తో ఉన్న ఏకైక స్కూల్ ఇదే కావటం ఆయన కృషికి నిదర్శనంగా కనిపిస్తోంది.ఈ వెర్టికల్ గార్డెన్ గురించి ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. సేంద్రియ పదార్థాలతోనే ఈ గార్డెన్ అభివృద్ధి చేశామనీ.. దీంతోపాటూ సైన్స్ అండే మేథమేటిక్ ఎగ్జిబిషన్ కూడా తయారుచేస్తున్నామని ఇది విద్యార్ధులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

పారేసే వస్తువుల్ని కూడా ఎలా ఉపయోగించుకోవచ్చో విద్యార్ధులకు నేర్పిస్తున్నామని తెలిపారు. పిల్లలు ప్రకృతి గురించి తెలుసుకోవాలి. దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలుసుకోవాలి. ప్రకృతిని పరిరక్షించుకోవటం ఎలా? అనేలా నేర్పిస్తున్నామని తెలిపారు. ఇంత అందమైన గార్డెను తయారు చేసిన ప్రిన్సిపల్, టీచర్లపై ప్రశంసలు కురుస్తున్నారు.