తన Semenతో తానే గర్భం దాల్చాలనుకుంటున్న డాక్టర్..!!

తన Semenతో తానే గర్భం దాల్చాలనుకుంటున్న డాక్టర్..!!

Ahmedabad transgender doctor innovative idea : ఏ బిడ్డకైనా తల్లీ దండ్రీ ఇద్దరు ఉంటారు. కానీ ఒకే బిడ్డకు తల్లీ తండ్రీ ఒక్కరే కావటం గురించి విన్నారా? అంటే కాస్త ఆలోచించాల్సిన విషయం. కానీ ఓ డాక్టర్ కు వచ్చిన ఓ అరుదైన అద్భుతమైన ఆలోచన ‘తన బిడ్డకు తానే తల్లీతండ్రీ అవ్వాలనుకున్నాడు. అంటే ‘తన వీర్యం (Semen)తో తానే గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చి తల్లి కావాలనుకున్నాడు.

మగాడుగా పుట్టిన ఓ వ్యక్తి తన వీర్యాన్ని భద్ర పరిచి అనంతరం తాను స్త్రీగా మారి తాను భద్రపరిచిన వీర్యంతోనే తాను గర్భం దాల్చాలని ఓ డాక్టర్ కంటున్న కల..! ట్రాన్స్ జెండర్ గా మారి తన వీర్యంతో తానే తన బిడ్డకు జన్మనివ్వాలని కలలు కంటున్న ఓ ట్రాన్స్ జెండర్ డాక్టర్ కల..!!

అహ్మదాబాద్‌కు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ డాక్టర్ తన వీర్యాన్ని తాను పురుషుడిగా ఉండగానే భద్రపరిచింది. తరువాత అదే వీర్యంతో తానే తల్లి కూడా అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇది ఆమె (అతని) కల. ఆ డాక్టర్ పేరు డాక్టర్ జెస్నూర్ డయారా..వయస్సు 25ఏళ్లు. గోద్రాలోని చిన్న గ్రామం పంచమహల్‌లో జన్మించింది. పుట్టినప్పుడు పురుషుడిలా అంగాలతో పుట్టింది. ఓ పురుషుడికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ తోనే ఉండేది.

కానీ వయసు వచ్చే కొద్దీ తనలో స్త్రీ లక్షణాలు పెరుగుతుండడం గుర్తించింది. తానో ట్రాన్స్‌జెండర్ అని తెలిసొచ్చింది. దీంతో స్త్రీగా మారిపోవాలని నిర్ణయించుకుంది. కానీ స్త్రీగా మారిన తరువాత తాను తల్లిని కావాలని అనుకుంది. అదికూడా వేరే వ్యక్తి బిడ్డకు కాకుండా తన బిడ్డకే తాను తల్లినవ్వాలనుకుంది. ఆ బిడ్డకు తండ్రి..తల్లీకూడా తానే కావాలని అనుకుంది..!! గుజరాత్ లోని మొట్టమొదటి ట్రాన్స్ ఉమెన్ డాక్టర్ జెస్నూర్ డయారా…

తాను ఇటీవల రష్యన్ యూనివర్శిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీని సంపాదించిన డాక్టర్ కాబట్టి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంది. తన వీర్యాన్ని భద్రపరిచాడు. ఆనంద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్‌లో తన వీర్యాన్ని క్రయోజనిక్ పద్ధతిలో భద్రపరిచాడు. (అప్పటికి పురుషుడిగానే ఉన్నాడు )తాను స్త్రీగా మారిన తరువాత ఈ వీర్యాన్ని వినియోగించి బిడ్డను కనాలని భావిస్తోంది.

Ahmedabad treansgender doctror

త్వరలో సర్జరీతో ఆమె పూర్తిగా స్త్రీగా మారిపోబోతోంది. శస్త్ర చికిత్స పూర్తయిన తరువాత, ఈ వీర్యంతో ఆమె తల్లి కానుంది. ఒకవేళ అదే జరిగితే ఒక బిడ్డకు తల్లి, తండ్రి తానే అయిన ఏకైక వ్యక్తిగా డయారా రికార్డు సృష్టించనుంది.. కాగా..డాక్టర్ డయారా ఇటీవలే రష్యాకు చెందిన వైద్య యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. దీని ద్వారా గుజరాత్‌ రాష్ట్రంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్‌గా రికార్డు సృష్టించారు.