గతానికి ప్రాణం పోస్తున్న టెక్నిక్.. డీప్‌ఫేక్ టూల్..

గతానికి ప్రాణం పోస్తున్న టెక్నిక్.. డీప్‌ఫేక్ టూల్..

ai powered photo:క్రొత్త ఫోటో-యానిమేటింగ్ సాధనం AI(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) శక్తితో పనిచేసే ‘డీప్ నోస్టాల్జియా’ టెక్నిక్‌ను ఉపయోగించి గతానికి ప్రాణం పోస్తున్నారు టెక్నాలజీ నిపుణులు. ఒకసారి ప్రయత్నించిన తరువాత ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ టెక్నిక్ గురించే చర్చలు..

ఆన్‌లైన్ వంశవృక్ష సంస్థ మై హెరిటేజ్(MyHeritage) నుండి వచ్చిన డీప్ ఫేక్-స్టైల్ సాధనం మీ పాత ఫోటోలను.. తల్లిదండ్రుల లేక తాతల ఫోటోలను.. ముఖ కవళికల ఆధారంగా కదలికలను యానిమేట్ చేస్తుంది. అసాధారణమైన పద్ధతిలో 10నుంచి 20సెకనుల వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేలా ఈ టెక్నిక్ చాలా అధ్భుతంగా ఉంది.. వాటిని మీ కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు.

జీనియాలజీని రూపొందించే ‘మై హెరిటేజ్’ వెబ్ తీసుకొచ్చిన ఈ టూల్ ద్వారా.. చనిపోయిన బంధువుల ఫొటోల ముఖాలను యానిమేట్ చేయడానికి ఈ ప్రత్యేకరకం డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఆ టూల్‌కు ‘డీప్ నోస్టాల్జియా’ అనే పేరు పెట్టారు. కొంతమందికి ఈ ఫీచర్‌ సంచలనం సృష్టించేదిగా అనిపిస్తే, మరికొంతమందికి ఇది మాయాజాలంగా అనిపిస్తోంది.

డీప్ ఫేక్ వ్యక్తులను తయారు చేయకుండా అడ్డుకోడానికి తాము ఇందులో ‘స్పీచ్’ చేర్చలేదని కంపెనీ చెప్పింది. డీప్ ఫేక్ టెక్నాలజీపై ఒక చట్టం తీసుకురావాలని బ్రిటన్ అనుకుంటున్న సమయంలో ఈ టూల్ బయటకు వచ్చింది. సంబంధిత వ్యక్తి అంగీకారం లేకుండా ఫేక్ తయారుచెయ్యడం తప్పుగా భావించి లండన్ ప్రభుత్వం.. చట్టం కూడా చేస్తోండగా.. ఇప్పుడు బయటకు వచ్చిన ఈ టెక్నాలజీ చర్చకు కారణం అయ్యింది.

ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేయకుండా అడ్డుకోడానికి ఇందులో ‘స్పీచ్‌’ను చేర్చలేదని మై హెరిటేజ్ సైట్ చెబుతోంది. జీవించి ఉన్న వ్యక్తుల వాయిస్‌తో ఫేక్ చేసే పరిస్థితి ఉందని, అటువంటి ప్రమాదం రాకుండా ఉండేందుకు వాయిస్‌ను చేర్చలేదని సైట్ చెబుతోంది. పాత జ్ఞాపకాలకు జీవం పోసే ఉద్దేశంతో, మేం దీనిని రూపొందించాం” అని కంపెనీ చెప్పింది.

ఇజ్రాయెల్ కంపెనీ డీ-ఐటీ ‘డీప్ నోస్టాల్జియా’ టెక్నాలజీని అభివృద్ధి చేయగా.. సజీవంగా ఉన్నవారి అంతకు ముందు వీడియోల ఆధారంగా ఆ కంపెనీ తమ అల్గారిథంకు శిక్షణ ఇస్తుంది. దాని ద్వారా ప్రజల ముఖాలు, వాళ్ల భావాలు మార్చి వీడియోలు రూపొందిస్తుంది. ఈ నెల మొదట్లో ఒక కంపెనీ ఇదే టెక్నాలజీని ఉపయోగించి ఒక అబ్రహాం లింకన్‌ వీడియోను యూట్యూబ్‌లో పెట్టింది. దానిని లింకన్ జన్మదినం సందర్భంగా పోస్ట్ చేశారు.

ఈ వీడియో కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇందులో అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ మాట్లాడుతున్నట్లు చూపించారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి చాలామంది తమ పూర్వీకుల యానిమేటెడ్ వీడియోలు చేసి ట్విటర్‌లో పెట్టడం మొదలెట్టారు. కొంతమంది వాటిని అద్భుతంగా ఉన్నాయని చెబితే, మరికొంతమంది మాత్రం ఈ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేశారు.

MyHeritage Deep Nostalgia GIF