AIADMK: 18 మంది పన్నీర్ సెల్వం మ‌ద్ద‌తుదారుల‌ను పార్టీ నుంచి తొల‌గించిన ప‌ళ‌నిస్వామి

వారిలో ప‌న్నీర్ సెల్వం ఇద్ద‌రు కుమారులు, ఎంపీ ఓపీ ర‌వీంద్ర‌నాథ్‌, జ‌య‌పార్దీప్, మాజీ మంత్రి న‌ట‌రాజ‌న్, కే కృష్ణ‌మూర్తి, మ‌రుధు అల‌గురాజ్ కూడా ఉన్నారు. ఏఐఏడీఎంకే నుంచి ప‌న్నీర్ సెల్వాన్ని ప‌ళ‌నిస్వామి ఇంతకు ముందే తొల‌గించిన విష‌యం తెలిసిందే.

AIADMK: 18 మంది పన్నీర్ సెల్వం మ‌ద్ద‌తుదారుల‌ను పార్టీ నుంచి తొల‌గించిన ప‌ళ‌నిస్వామి

Panneerselvam

AIADMK: త‌మిళ‌నాడులోని ఏఐఏడీఎంకే పార్టీ తాత్కాలిక అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే బాధ్య‌త‌లు స్వీక‌రించిన మాజీ సీఎం ప‌ళ‌నిస్వామి ఇవాళ కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం వ‌ర్గానికి చెందిన 18 మందిని పార్టీ నుంచి తొల‌గించారు. వారిలో ప‌న్నీర్ సెల్వం ఇద్ద‌రు కుమారులు, ఎంపీ ఓపీ ర‌వీంద్ర‌నాథ్‌, జ‌య‌పార్దీప్, మాజీ మంత్రి న‌ట‌రాజ‌న్, కే కృష్ణ‌మూర్తి, మ‌రుధు అల‌గురాజ్ కూడా ఉన్నారు. ఏఐఏడీఎంకే నుంచి ప‌న్నీర్ సెల్వాన్ని ప‌ళ‌నిస్వామి ఇంతకు ముందే తొల‌గించిన విష‌యం తెలిసిందే.

Asia Cup In Sri Lanka: ఈ స‌మ‌యంలో ఏమీ చెప్ప‌లేం: గంగూలీ

పార్టీ కార్యవర్గ స‌మావేశంలో ప‌ళ‌నిస్వామి వ‌ర్గం ఇటీవ‌ల ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంది. ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ప‌ళ‌నిస్వామిని ఎన్నుకుని, ప‌న్నీర్ సెల్వం ప్రాథ‌మిక స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేశారు. అయితే, త‌న‌ను పార్టీ నుంచి ఎవ్వ‌రూ తొల‌గించ‌లేరని, ఆ హ‌క్కు వారికి లేద‌ని, తాను న్యాయ‌స్థానానికి వెళ్తాన‌ని ప‌న్నీర్ సెల్వం చెప్పారు. ఏఐఏడీఎంకేలో ఏక నాయక‌త్వం ఉండాల‌ని క‌స‌ర‌త్తు జ‌రిగిన వేళ ప‌ళ‌నిస్వామి, ప‌న్నీర్ సెల్వం వ‌ర్గానికి మ‌ధ్య వివాదం రాజుకుంది. చివరకు ప‌ళ‌నిస్వామి వర్గమే నెగ్గినట్లయింది.