బారికేడ్లు తీసి డబీర్ పురా Flyover తెరిచిన MIM ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి

  • Published By: madhu ,Published On : May 16, 2020 / 06:42 AM IST
బారికేడ్లు తీసి డబీర్ పురా Flyover తెరిచిన MIM ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంకా వ్యాపిస్తూనే ఉంది. పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రధానంగా GHMC పరిధిలో కేసులు అధికంగా నమోదవుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. దీంతో వైరస్ మరింత వ్యాపించకుండా ఉండేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. కేసులు నమోదైన ప్రాంతాన్ని కంటైన్ మెంట్ ప్రాంతంగా ప్రకటించి…నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. బారికేడ్లను తొలగించి డబీర్ పురా ఫ్లై ఓవర్ ఓపెన్ చేసిన MIM ఎమ్మెల్యే బలాల అహ్మద్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

ఎల్బీనగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్ లలో కేసులు అధికమౌతున్నాయి. 4 జోన్లను కంటైన్ మెంట్లుగా ప్రకటించి..నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. AIMIM పార్టీకి చెందిన ఇతరులు లాక్ డౌన్ నిబంధనలు పాటించడం లేదన్నారు. కానీ బారికేడ్లను తొలగింపు విషయంలో ఏసీపీ నుంచి అనుమతి తీసుకున్నారని డబీర్ పురా పోలీసులు వెల్లడించినట్లు తెలుస్తోంది. 

కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం పోరాడుతోందని, మరోవైపు లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారిలో AIMIM పార్టీకి చెందిన వారున్నారని రాజాసింగ్ వెల్లడించారు. పోలీసులను, వైద్యులను బెదిరిస్తున్నారన్నారు. లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. 

తెలంగాణలో 1, 414 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 34 మంది చనిపోయారు. కేంద్రం విధించిన లాక్ డౌన్ 2020, మే 17తో ముగియనుండగా..తెలంగాణలో మాత్రం మే 29వ తేదీ వరకు నిబంధనలు అమల్లో కొనసాగనున్నాయి. సడలింపులు, ఇతరత్రా విషయాలపై మే 15వ తేదీన కేబినెట్ సమావేశంలో చర్చించి..మే 17న వెల్లడిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. 

 

Read Here>>  13 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలిపిన TikTok