Presidential Polls: య‌శ్వంత్ సిన్హా ఫోన్ చేశారు.. ఆయ‌న‌కే ఓటు వేస్తాం: అస‌దుద్దీన్

రాష్ట్రప‌తి ఎన్నిక‌లో విప‌క్ష పార్టీల అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని తాము నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఏఐఎంఐఎం అధ్య‌క్షుడు అస‌దుద్దీన్ ఒవైసీ చెప్పారు.

Presidential Polls: య‌శ్వంత్ సిన్హా ఫోన్ చేశారు.. ఆయ‌న‌కే ఓటు వేస్తాం: అస‌దుద్దీన్

Presidential Polls: రాష్ట్రప‌తి ఎన్నిక‌లో విప‌క్ష పార్టీల అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని తాము నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఏఐఎంఐఎం అధ్య‌క్షుడు అస‌దుద్దీన్ ఒవైసీ చెప్పారు. ఈ మేర‌కు ఆయ‌న ఇవాళ ఓ ప్ర‌క‌ట‌న చేశారు. ఏఐఎంఐఎం ఎంపీలు, ఎమ్మెల్యేలు అంద‌రూ విప‌క్ష పార్టీల రాష్ట్రప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు ఓటు వేస్తార‌ని అస‌దుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. య‌శ్వంత్ సిన్హా త‌న‌కు ఫోన్ చేసి మాట్లాడార‌ని ఆయ‌న వివ‌రించారు.

Maharashtra: ఈ నెల 22నే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌నుకున్న ఉద్ధ‌వ్.. చివ‌ర‌కు..

ఏఐఎంఐఎం పార్టీకి లోక్‌స‌భ‌లో ఇద్ద‌రు స‌భ్యులు ఉన్నారు. తెలంగాణ‌లో ఏడుగురు, బిహార్‌లో ఐదుగురు, మ‌హారాష్ట్రలో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా, జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌లో మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని య‌శ్వంత్ సిన్హా దేశంలోని ప‌లు పార్టీల‌ను కోరుతున్నారు. ఇప్ప‌టికే య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. మ‌రోవైపు, ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము కూడా మ‌ద్ద‌తు కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఇప్ప‌టికే ఆమె ప‌లువురు కీల‌క‌ నేత‌లకు ఫోన్ చేశారు.