Agnipath: 57,000కు చేరిన అగ్నిపథ్ దరఖాస్తులు

ఆదివారం సాయంత్రానికి.. అంటే మూడు రోజుల్లోనే దాదాపు 57,000 దరఖాస్తులు వచ్చాయి. 17-21 ఏళ్ల యువత దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే, గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా రిక్రూట్‌మెంట్ జరగలేదు.

Agnipath: 57,000కు చేరిన అగ్నిపథ్ దరఖాస్తులు

Agnipath (5)

Agnipath: ఒకవైపు దేశవ్యాప్తంగా యువత నుంచి ‘అగ్నిపథ్’ స్కీంపై ఆందోళనలు వ్యక్తమవుతుంటే, మరోవైపు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. అగ్నిపథ్ స్కీంలో చేరేందుకు అభ్యర్థుల నుంచి మూడు రోజుల్లో 56,960 దరఖాస్తులు వచ్చినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) వెల్లడించింది. గత శుక్రవారం అగ్నిపథ్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Assam Floods: అసోం వరదలు.. 127కు చేరిన మృతుల సంఖ్య

ఆదివారం సాయంత్రానికి.. అంటే మూడు రోజుల్లోనే దాదాపు 57,000 దరఖాస్తులు వచ్చాయి. 17-21 ఏళ్ల యువత దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే, గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా రిక్రూట్‌మెంట్ జరగలేదు. అందువల్ల ఈ సారి రెండేళ్లు అదనపు అర్హత వయస్సుగా నిర్ధరించారు. అంటే ఈ ఏడాదికి అర్హత వయస్సు 23గా నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి మళ్లీ 21 ఏళ్లే అర్హతగా ఉంటుంది. జూలై 5 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అర్హత, ఇతర వివరాలు అన్నీ సంబంధిత వెబ్‌సైట్‌లో పొందు పరిచారు. అగ్నిపథ్ స్కీంను కేంద్రం ఈ నెల 14న ప్రకటించింది. ఇది నాలుగేళ్ల కాల పరిమితి కలిగిన ఉద్యోగ పథకం. ఆ తర్వాత నిబంధనలకు అనుగుణంగా సౌకర్యాలు, ఆర్థిక చేయూత ఉంటుంది.

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఎల్జీ మధ్య మరో వివాదం

అగ్నివీర్‌లకు సైన్యంలో పదిశాతం రిజర్వేషన్లు కూడా కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అగ్నివీర్‌లకు రాష్ట్రంలోని పోలీసు శాఖల్లో నియామకాల సందర్భంగా ప్రాధాన్యం కల్పిస్తామని బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రకటించాయి. ఇక, ఇటీవల అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న వాళ్లకు ఈ స్కీంలో చేరే అవకాశం ఉండదని కేంద్రం ప్రకటించింది.