Research: వాహనాల కంటే పందుల వలనే వాతావరణ కాలుష్యం

మనం నిత్యం ఉపయోగించే వాహనాల వలన వాతావరణ కాలుష్యం అధికంగా జరుగుతుందని మనకు బాగా తెలిసిందే. కానీ.. పెరిగిన నాగరికత, ఉరుకుల పరుగుల జీవితాలలో వాతావరణ కాలుష్యాన్ని పట్టించుకొనే ఓపిక మనుషులకు ఉండడం లేదు. అందుకే నానాటికీ ఇబ్బడి ముబ్బడిగా వాహనాలు పెరిగిపోతున్నాయి.

Research: వాహనాల కంటే పందుల వలనే వాతావరణ కాలుష్యం

Research

Research: మనం నిత్యం ఉపయోగించే వాహనాల వలన వాతావరణ కాలుష్యం అధికంగా జరుగుతుందని మనకు బాగా తెలిసిందే. కానీ.. పెరిగిన నాగరికత, ఉరుకుల పరుగుల జీవితాలలో వాతావరణ కాలుష్యాన్ని పట్టించుకొనే ఓపిక మనుషులకు ఉండడం లేదు. అందుకే నానాటికీ ఇబ్బడి ముబ్బడిగా వాహనాలు పెరిగిపోతున్నాయి. వాతావరణం కూడా ఘోరంగా దెబ్బతింటుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వాతావరణ కాలుష్యం.. దాని కారకాలపై విస్తృత అధ్యయనాలు కొనసాగుతున్నాయి.

అలా ఓ అంతర్జాతీయ నిపుణుల బృందం చేసిన పరిశోధనలలో వాహనాల కంటే పందుల వలనే ఎక్కువగా వాతావరణ కాలుష్యం జరుగుతుందని తేల్చారు. అడవి పందులు మట్టిని తవ్వడం ద్వారా ప్రతి ఏడాది మట్టిలోని 4.9 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ గాలిలో కలుస్తుందట. ఇది ఒక ఏడాదిలో 1.1 మిలియన్ కార్లు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ కు సమానం. అంటే ఒక ఏడాదిలో అడవి పందుల వలన ఒక మిలియన్ కార్ల కంటే ఎక్కువగా వాతావరణ నష్టం జరుగుతుందని అధ్యయనంలో తేలింది.

క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయం, కాంటర్బరీ విశ్వవిద్యాలయం పరిశోధకుల నేతృత్వంలోని ఒక అంతర్జాతీయ బృందం ఐదు ఖండాలలో అడవి పందులు చేస్తున్న వాతావరణ నష్టాన్ని గుర్తించడానికి ఆధునిక మ్యాపింగ్ పద్ధతులతో పాటు జనాభా అంచనా నమూనాలను ఉపయోగించి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ బృందంలోని సభ్యుడైన డాక్టర్ క్రిస్టోఫర్ ఓబ్రయాన్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు పెరుగుతున్న అడవి పందులు వాతావరణానికి గణనీయమైన ముప్పుగా ఉంటుందని పేర్కొన్నారు.

సహజంగా అడవి పందులు పొలాలలో నిత్యం ఆహారవేటలో భాగంగా భూమిని దున్నినట్లుగా చేయడం భూమి పొరల్లోని కార్బన్ డయాక్సైడ్ గాల్లో కలిసి వాతావరణ కాలుష్యమవుతుదని డాక్టర్ ఓబ్రియన్ చెప్పారు. వ్యవసాయ కార్యక్రమాలలో భాగంగా భూమిని దున్నడం మూలంగా కూడా కాలుష్యం జరుగుతుండగా పందులు నిత్యం భూమి కలియబెట్టడం వలన కార్బన్ డయాక్సైడ్ అధికంగా గాల్లో చేరుతుందని వారు పేర్కొన్నారు.

అమెరికా, యూరప్, చైనాలలో అడవి పంది భూమి నుండి కార్బన్ ఉద్గారాలను ఎలా బయటకి తెస్తుందో మునుపటి పరిశోధనలను కూడా పరిలిచిన నిపుణుల బృందం.. మట్టిలో కార్బన్ సమృద్ధిగా ఉన్న ప్రాంతాలలో పందులను విస్తరణ ఎక్కువైతే భవిష్యత్ లో ఇది మరింత ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వాతావరణ కాలుష్యానికే కాదు భవిష్యత్ లో ఆహార భద్రతకు కూడా ఇది ముప్పుగా మారవచ్చని అంచనా వేశారు.