Airtel : కస్టమర్లకు నచ్చినట్టుగా ప్లాన్స్‌

Airtel : కస్టమర్లకు నచ్చినట్టుగా ప్లాన్స్‌

Airtel

Airtel : భారత టెలికం సంస్థలు ప్రజలను ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి. వినియోగదారుల కోసం కొత్త కొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ తరహాలోనే ఎయిర్‌టెల్‌ భారత్‌లో వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. ఫైబర్ నెట్, డీటీహెచ్, మొబైల్‌ సర్వీసులను ఒకే గొడుకు కిందకు తెచ్చింది.

కస్టమర్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ కనెక్షన్లను ఒకే ప్లాన్ ద్వారా పొందవచ్చు . వినియోగదారులకు నచ్చిన విధంగా ప్లాన్స్ రూపొందించుకోవచ్చు. ఇక కంపెనీ వెల్లడించిన నెలవారీ ప్లాన్స్ విషయానికి వస్తే.. ఫైబర్ రూ.499, డీటీహెచ్ రూ. 153, మొబైల్ రూ.499 నుంచి మొదలవుతాయి. కంపెనీ ప్రవేశపెట్టిన నాలుగు రకాల ప్లాన్స్‌లో దేనినైనా ఎంచుకునే అవకాశం వినియోగదాలకు ఇచ్చింది.

రూ.1598 ప్లాన్ తో రెండు మొబైల్స్, ఒక ఫైబర్ నెట్ వాడుకోవచ్చు. రూ.1349 ప్లాన్ తో మూడు మొబైల్స్, ఒక డీటీహెచ్ ని ఉపయోగించవచ్చు. రూ.2,099 ప్లాన్‌ కింద మూడు మొబైల్, ఒక ఫైబర్, ఒక డీటీహెచ్‌ కనెక్షన్‌ ఇస్తారు. కాగా ఈ ప్లాన్స్ కి జీఎస్టీ అదనంగా ఉంటుంది. ఇన్‌స్టాలేషన్, సర్వీస్‌ చార్జీలు లేవు. ఎయిర్‌టెల్‌ బ్లాక్‌ వినియోగదారులు కస్టమర్‌ కేర్‌ ప్రతినిధిని 60 సెకన్లలోపే ఫోన్‌లో సంప్రదించవచ్చని కంపెనీ తెలిపింది.