Airtel Xstream Fiber Plans : ఎయిర్‌టెల్ కొత్త Xstream ఫైబర్ ప్లాన్లు.. ఫ్రీగా ఓటీటీ, టీవీ ఛానెళ్లు చూడొచ్చు..!

Airtel Xstream Fiber Plans : భారతీ ఎయిర్‌టెల్ కొత్త ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. గతంలో ప్లాన్ల కన్నా కొత్తగా కొన్ని ప్లాన్ బెనిఫిట్స్ పొందవచ్చు.

Airtel Xstream Fiber Plans : ఎయిర్‌టెల్ కొత్త Xstream ఫైబర్ ప్లాన్లు.. ఫ్రీగా ఓటీటీ, టీవీ ఛానెళ్లు చూడొచ్చు..!

Airtel Announces New Xstream Fiber Broadband Plans, Now Offers Free Tv And Netflix With Them

Airtel Xstream Fiber Plans : భారతీ ఎయిర్‌టెల్ కొత్త ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. గతంలో ప్లాన్ల కన్నా కొత్తగా కొన్ని ప్లాన్ బెనిఫిట్స్ పొందవచ్చు. అదనపు బెనిఫిట్స్ పొందాలంటే ఎక్కువ చెల్లించాలి. ఎయిర్‌టెల్ రూ. 1599, రూ. 699, రూ. 1,099తో సహా 3 కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ప్రకటించింది. Airtel 4K Xstream బాక్స్‌తో 350కి పైగా ఛానెళ్లను ఉచితంగా యాక్సెస్‌ చేసుకోవచ్చు. కొత్త ప్లాన్‌లు, కస్టమర్‌లకు ఎలాంటి బెనిఫిట్స్ అందిస్తుందో తెలుసుకుందాం..

ఎయిర్‌టెల్ రూ. 1,599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ నుంచి లేటెస్ట్ రూ. 1,599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రూ. 1,498 ప్లాన్‌ మాదిరిగానే ఉంటుంది. కానీ, కొత్త యూజర్లు Airtel 4K Xstream బాక్స్‌తో 350కి పైగా ఛానెల్‌లకు యాక్సెస్‌ను చేసుకోవచ్చు. ఈ సెటప్ బాక్సు కోసం రూ. 2,000 చెల్లించాల్సి ఉంటుంది. వన్-టైమ్ ఛార్జ్ మాత్రమే. ఈ సెటప్ బాక్స్‌తో, యూజర్లు కేబుల్ టీవీ ఛానళ్లతో పాటు OTT కంటెంట్‌ను పొందవచ్చు. వినియోగదారులు 300Mbps ఇంటర్నెట్ స్పీడ్ పొందవచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచితంగా వీక్షించవచ్చు.

Airtel Announces New Xstream Fiber Broadband Plans, Now Offers Free Tv And Netflix With Them (1)

Airtel Announces New Xstream Fiber Broadband Plans, Now Offers Free Tv And Netflix With Them 

ఈ ప్లాన్‌లో SonyLIV, ErosNow, Lionsgate Play, Hoichoi, ManoramaMax, Shemaroo, Ultra, HungamaPlay, EPICon, DivoTV, Klikk, Nammaflix, Dollywood Shorts TVతో సహా 14 OTTల కోసం Airtel Xstream ప్రీమియం సింగిల్ లాగిన్ అకౌంట్ చాలు. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో ఒకరు నెలవారీ ప్రాతిపదికన 3.3TB డేటాను వినియోగించుకోవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 1099 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ :
రూ.1099 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ద్వారా 3.3TB నెలవారీ FUP డేటాతో 200Mbps స్పీడ్ పొందవచ్చు. OTT యాక్సస్ కావాలంటే రూ. 1599 ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ముందు ప్లాన్లలో Netflixని పొందలేరు. మీరు ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో అన్ని ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఆఫర్ కూడా వ్యాలిడిటీ అందిస్తుంది. కస్టమర్‌లు ఈ ప్లాన్ ద్వారా 350+ టీవీ ఛానెల్‌లను ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 699 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ :
రూ. 699 ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 40Mbps స్పీడ్ అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మినహా పైన పేర్కొన్న అన్ని OTT ప్లాట్‌ఫారమ్‌ల్లో యాక్సస్ చేసుకోవచ్చు. కస్టమర్‌లు 3.3TB నెలవారీ డేటాను పొందవచ్చు. టీవీ ఆఫర్ కూడా వర్తిస్తుంది. అన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఇప్పటికే అధికారిక సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Read Also : Airtel Offer: స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్‌టెల్