Airtel Recharge Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఈ రాష్ట్రాల్లో నెలవారీ రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెరిగాయి.. ఎంతంటే?

Airtel Recharge Plans : భారతీ ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. కొన్ని రాష్ట్రాల్లో రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెరిగాయి. హర్యానా, ఒడిశాలో ఎయిర్‌టెల్ తన కనీస రీఛార్జ్ మొబైల్ ప్లాన్ ధరను పెంచింది. దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ వెబ్‌సైట్‌లో లిస్టు చేసింది.

Airtel Recharge Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఈ రాష్ట్రాల్లో నెలవారీ రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెరిగాయి.. ఎంతంటే?

Airtel increases price of minimum monthly recharge plan in these states

Airtel Recharge Plans : భారతీ ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. కొన్ని రాష్ట్రాల్లో రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెరిగాయి. హర్యానా, ఒడిశాలో ఎయిర్‌టెల్ తన కనీస రీఛార్జ్ మొబైల్ ప్లాన్ ధరను పెంచింది. దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ వెబ్‌సైట్‌లో లిస్టు చేసింది. రెండు రాష్ట్రాల్లో కనీస నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర దాదాపు 57 శాతం పెరిగి రూ.155కి చేరుకుంది. ఇప్పటివరకు, హర్యానా, ఒడిశాలో Airtel కనీస రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 99గా ఉంది. సెకనుకు రూ. 2.5 పైసల చొప్పున 200 MB మొబైల్ డేటా, కాల్‌లను అందించింది.

టెల్కో ఇప్పుడు రూ.155 ప్లాన్‌ను అందిస్తుంది. 1GB మొత్తం డేటాతో పాటు 300 SMSలతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. PTI నివేదిక ప్రకారం.. కంపెనీ కొత్త ప్లాన్ ట్రయల్‌ను ప్రారంభించింది. దీని ఆధారంగా భారత్ అంతటా రీఛార్జ్ ప్లాన్లను రిలీజ్ చేసే అవకాశం ఉంది. రూ.155 కన్నా తక్కువ ధర ఉన్న SMS, డేటాతో 28 రోజుల కాలింగ్ ప్లాన్‌లను టెలికాం కంపెనీ త్వరలో ముగియవచ్చునని పేర్కొంది.

Airtel increases price of minimum monthly recharge plan in these states

Airtel increases price of minimum monthly recharge plan in these states

హర్యానా, ఒడిశా సర్కిళ్లలో భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్-టెస్టింగ్ టారిఫ్ పెంపును ప్రారంభించింది. అంచనాలకు మించి భారీ అప్‌సైడ్ రిస్క్‌ను యాడ్ చేసిందని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ తెలిపింది. మునుపటి రూ. 99 రీఛార్జ్ రూ. 99 టాక్-టైమ్ వాల్యూను కలిగి ఉంది. 28 రోజుల వరకు వ్యాలిడిటీ అయ్యే 200 MB చాలా అన్ లిమిటెడ్ డేటాను కలిగి ఉంది.

ఇప్పుడు రూ. 155 కనీస రీఛార్జ్ అన్‌లిమిటెడ్ వాయిస్, 1GB డేటా అలవెన్స్, 300 SMSలను అందిస్తుంది. కనిష్ట రీఛార్జ్ వాల్యూలో భారీ 57 శాతం పెరిగింది. ఎంపిక చేసిన సర్కిల్‌లలో కనీస రీఛార్జ్ ఆఫర్‌ను రూ. 79 నుంచి రూ. 99కి పెంచినప్పుడు Airtel 2021లో ఇదే విధమైన మార్కెట్-టెస్టును నిర్వహించిందని నివేదిక పేర్కొంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : OnePlus Nord N20 SE : ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15వేల లోపు ధరలో వన్‌ప్లస్ నార్డ్ N20 SE ఫోన్.. ఏయే ఫీచర్లు ఉన్నాయంటే?