Punjab Election : బీజేపీలో చేరిన అకాళీదళ్ ముఖ్య నేత

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్‌ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శిరోమణి అకాళీదళ్‌ పార్టీ కీలక నేతగా కొనసాగిన మాజిందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు.

Punjab Election : బీజేపీలో చేరిన అకాళీదళ్ ముఖ్య నేత

Sirsa

Punjab Election  అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్‌ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శిరోమణి అకాళీదళ్‌ పార్టీ కీలక నేతగా కొనసాగిన మాజిందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు. అకాలీదళ్‌కు రాజీనామా చేసిన కొద్ది సమయానికే ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మేం‍ద్ర ప్రధాన్‌, గజేంద్రసింగ్‌ షేకావత్‌ కూడా పాల్గొన్నారు.

అయితే అకాలీదళ్ నుంచి నిష్క్రమించడానికి గల కారణాలను మాజిందర్ సింగ్ తన రాజీనామా లేఖలో పేర్కొనలేదు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, అకాలీదళ్ కి రాజీనామా చేసిన కొద్ది సమయానికే మాజిందర్ కాషాయ కండువా కప్పుకోవడం పట్ల రాజకీయపరమైన బలమైన కారణాలు ఉండి ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. ఇక,ఢిల్లీ సిఖ్‌ గురుద్వారా మెనెజ్‌మెంట్‌ కమిటీ (DSGMC)కు రాజీనామా చేస్తున్నట్లు మాజిందర్ సింగ్ ట్విట్లర్ లో ప్రకటించారు. బీజేపీతో కలిసి సిక్కుల అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఇక,పంజాబ్‌లో ఎలాగైనా ఈసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఊవిళ్లూరుతున్న అకాలీదళ్ పార్టీకి మాజిందర్ సింగ్ బీజేపీ చేరికతో కొంత మేరకు నష్టం జరిగింది.

కాగా,పంజాబ్‌ అసెంబ్లీకి ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఒక వైపు కాంగ్రెస్, మరొకవైపు అకాలీ-బీఎస్పీ కూటమి హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే ఈ ఇరు పార్టీలతో పాటు ఆప్, బీజేపీలు కూడా గట్టిపోటీని ఇచ్చేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి. ఇక మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా సొంత పార్టీతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్- శిరోమణి అకాలీదళ్ మధ్యనే అని చర్చ జరుగుతోంది.

అయితే, రైతుల ఆందోళన నేపథ్యంలో వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసినప్పటికీ..బీజేపీకి పంజాజ్ లో సొంతంగా అధికారాన్ని దక్కించుకోవడం అంత సులభంగా కనిపించడం లేదు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా జరుగుతున్న ఆందోళనల్లో ఎక్కువగా పాల్గొంది పంజాబ్ రైతులే. ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం బీజేపీకి పంజాబ్ లో రాజకీయంగా కలిసివస్తుందా లేదా అన్నది చూడాలి.

ALSO READ Omicron Variant : ఇతర దేశాల కంటే భారత్‌లో ఎక్కువ హైబ్రిడ్ రోగనిరోధక శక్తి ఉండవచ్చు, కోవిడ్ ఎక్స్‌పర్ట్