Akasa Air: ఆకాశ ఎయిర్‌కు డీజీసీఏ అనుమతి.. ఈ నెలలోనే సర్వీసులు ప్రారంభం

విమాన సర్వీసులు నడిపేందుకు కావాల్సిన ఏఓసీ (ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్)ను గురువారం పొందినట్లు ఆకాశ ఎయిర్ వెల్లడించింది. ఇదో స్టార్టప్ కంపెనీ. తక్కువ ఖర్చుతో కూడిన విమన సర్వీసులు అందించే లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభమైంది.

Akasa Air: ఆకాశ ఎయిర్‌కు డీజీసీఏ అనుమతి.. ఈ నెలలోనే సర్వీసులు ప్రారంభం

Akasa Air

Akasa Air: మరో కొత్త విమానయాన సంస్థ త్వరలో సేవలు ప్రారంభించబోతుంది. ప్రముఖ స్టాక్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భాగస్వామిగా ఉన్న ‘ఆకాశ ఎయిర్’కు డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఈ నెల చివరి వారం నుంచి సర్వీసులు ప్రారంభించేందుకు సంస్థ రెడీ అవుతోంది.

Eknath Shinde: షిండేకు ఆటోవాలాల మద్దతు.. ఉద్ధవ్‌కు కౌంటర్

విమాన సర్వీసులు నడిపేందుకు కావాల్సిన ఏఓసీ (ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్)ను గురువారం పొందినట్లు ఆకాశ ఎయిర్ వెల్లడించింది. ఇదో స్టార్టప్ కంపెనీ. తక్కువ ఖర్చుతో కూడిన విమన సర్వీసులు అందించే లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ మొదటగా ‘బోయింగ్ 737 మ్యాక్స్’ అనే విమానాన్ని గత ఏడాది జూన్ 21న డెలివరీ తీసుకుంది. మొత్తం ఇలాంటి 72 విమానాల్ని ఆర్డర్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. గత సోమవారం సంస్థ సిబ్బంది ధరించే యూనిఫామ్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఈ సంస్థ విమాన సర్వీసులు ఎలా ఉంటాయి అనే అంశాన్ని పరిశీలించిన తర్వాత డీజీసీఏ అనుమతులు మంజూరు చేసింది. ఇందుకోసం విమానాల్ని అనేక సార్లు ట్రయల్ రన్ చేసి చూపించాలి.

Fake Baba: 10టీవీ ఎఫెక్ట్… ఫేక్ బాబాపై కేసు నమోదు

నిర్ధిష్ట పరీక్షలన్నీ పాసయ్యాకే విమానయాన సంస్థలకు అనుమతులు ఇస్తారు. డీజీసీఏ అనుమతులు మంజూరు చేయడంపై ఆకాశ ఎయిర్ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ఇది కొత్త అధ్యయనానికి నాంది అని, ఈ నెల చివరి వారం నుంచి సేవలు ప్రారంభిస్తామని కంపెనీ చెప్పింది. ప్రస్తుతం ఈ సంస్థకు 18 విమానాలు ఉన్నాయి. ప్రతి ఏడాది 12-14 కొత్త విమానాలు ప్రారంభమవుతాయి. మొత్తం 72 విమానాలు కంపెనీలో చేరుతాయి.