జూన్ 18న ‘రొమాంటిక్’..

10TV Telugu News

Romantic: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న మూడో సినిమా ‘రొమాంటిక్’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. కేతికా శర్మ హీరోయిన్‌గా, అనిల్ పాదూరి డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు.

Romantic

శ్రీమతి లావణ్య సమర్పణలో, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్స్‌పై, పూరీ జగన్నాథ్, చార్మీ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ మూవీకి పూరీ జగన్నాథ్ స్టోరీ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.

Romantic

శివగామి రమ్యకృష్ణ కీలకపాత్రలో కనిపించనున్నారు. సోమవారం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ‘రొమాంటిక్’ మూవీని జూన్ 18న విడుదల చెయ్యనున్నారు.
ఈ సినిమాకి సంగీతం : సునీల్ కశ్యప్, కెమెరా : నరేష్ రానా, ఎడిటింగ్ : జునైద్ సిద్దిఖీ.

Romantic