Akhanda: బాలయ్యతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా.. ప్రగ్యా కామెంట్స్!

Akhanda: బాలయ్యతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా.. ప్రగ్యా కామెంట్స్!

Akhanda

Akhanda: టాలీవుడ్ మోస్ట్ వెయిటింగ్ సినిమాలలో బాలయ్య అఖండ కూడా ఒకటి. ఇప్పటికే సింహ, లెజెండ్ లాంటి భారీ బంపర్ హిట్స్ అనంతరం దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అఖండ. అసలే చాలా కాలంగా సరైన హిట్ సినిమా లేక నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అఖండ పోస్టర్స్, టీజర్స్ సినిమా మీద భారీ హైప్ కూడా క్రియేట్ చేయడంతో ఎప్పుడెప్ప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం కరోనాతో అన్ని సినిమాల మాదిరి అఖండ కూడా షూటింగ్ వాయిదా వేసుకోగా మళ్ళీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా నటిస్తున్న ప్రగ్యా జైస్వాల్ ఎదురుచూస్తుందట. ఎందుకంటే.. బాలయ్యతో షూటింగ్ స్పాట్ లో ఉంటే అసలు సమయమే తెలియదట. అంతగా జోక్స్ వేస్తూ అంతగా కలిసిపోతాడట. పలు సందర్భాల్లో మంచి యారోగెంట్ గా కనిపించే బాలయ్య సెట్స్ లో మాత్రం చాలా చిల్ గా ఉన్నారని ప్రగ్యా తెలిపింది.

నిజానికి అఖండ సినిమా ఒప్పుకొనే ముందు బాలయ్యతో సినిమా అనగానే కొంత భయపడ్డానని.. కానీ ఒకసారి ఆయనతో కలిసి సెట్స్ లోకి వెళ్ళాక తెలిసింది ఆయనేంటో అని ప్రగ్యా చెప్పుకొచ్చింది. చిల్ గా కూల్ గా ఎప్పుడూ ఉంటూ జోక్స్ పేలుస్తూ యాక్షన్ అనగానే యాక్షన్ లో దిగిపోయే హీరో బాలయ్యతో మళ్ళీ షూట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నా అని కూడా చెప్పింది. మరి కరోనా ఎప్పుడు పోతుందా మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో!