Akhil Akkineni: సాలిడ్ అవతార్.. ఏజెంట్ గా అఖిల్ కిరాక్ లుక్!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అలా ఉండగానే ఇప్పుడు మరో సినిమా.. మరో ఫస్ట్ లుక్ తో అఖిల్ రచ్చ లేపాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ తదుపరి సినిమా ఉండబోతోంది. కాగా, ఏప్రిల్ 8 అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

Akhil Akkineni: సాలిడ్ అవతార్.. ఏజెంట్ గా అఖిల్ కిరాక్ లుక్!

Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని హీరోలలో నాగ చైతన్య కాస్త బుద్ధిగా, పద్ధతిగా సినిమాలు చేసుకుంటుంటే అఖిల్ మాత్రం రావడమే ఓ రేంజ్ హైప్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా బోల్తా కొట్టినా ఫలితాలతో సంబంధం లేకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ కు మంచి అంచనాలు సెట్ చేసుకోగలిగాడు. కానీ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసినా ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. కానీ హైప్ పెంచడంలో మాత్రం అఖిల్ వెనక్కు తగ్గిందేలేదు. ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్స్ చూస్తే.. మళ్ళీ బొమ్మరిల్లు లాంటి మ్యాజిక్ చేస్తాడేమో అని దర్శకుడు భాస్కర్ మీద కాస్త అంచనాలు పెరిగాయి.

ఆ సినిమా అలా ఉండగానే ఇప్పుడు మరో సినిమా.. మరో ఫస్ట్ లుక్ తో అఖిల్ రచ్చ లేపాడు. స్టైలిష్ దర్శకుడిగా పేరున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ తదుపరి సినిమా ఉండబోతోంది. కాగా, ఏప్రిల్ 8 అక్కినేని వారబ్బాయి పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. మొదటి నుంచి వస్తున్న టాక్ ప్రకారమే ఈ చిత్రానికి ఏజెంట్ అనే టైటిల్ ను పెట్టగా.. స్పై తరహాలో ఈ సినిమా ఉంటుందని వచ్చిన టాక్ కు అనుగుణంగా ఈ టైటిల్ సెట్ చేసినట్లుగా కనిపిస్తుంది.

అతనొక్కడే, కిక్ నుండి మొన్నటి మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి వరకు సురేందర్ రెడ్డి అంటే సినిమాలో హీరోను ఇంకొస్తాయిలో చూపిస్తాడని పేరుంది. టేకింగ్ నుండి కాన్సెప్ట్ వరకు స్టైలిష్ గా ఉంటుందని సురేందర్ రెడ్డి అఖిల్ ను ఎలా చూపిస్తాడా అని గత వారం నుండి చర్చ జరుగుతూనే ఉంది. రెండు రోజుల క్రితం అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీ పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. కానీ అదేదీ కాకుండా లాంగ్ హెయిర్ తో సిగరెట్ కాలుస్తూ అఖిల్ రఫ్ లుక్ లో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని సాలిడ్ అవతార్ లో దర్శనం ఇచ్చాడు. మొత్తంగా ఒకే ఒక్క పోస్టర్ తో సినిమా మీద హైప్ పెంచేశారు.