మాల్దీవుల్లో మన్మథుడు.. అక్కినేని ఫ్యామిలీ హంగామా!

మాల్దీవుల్లో మన్మథుడు.. అక్కినేని ఫ్యామిలీ హంగామా!

Akkineni Family: అఖిల్ అక్కినేని మాల్దీవుల్లో చిల్ అవుతున్నాడు. ఒంటరిగా అక్కడి బీచ్‌లో తిరుగుతూ.. సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో అఖిల్ మాల్దీవ్స్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Akhil Akkineni

తాజాగా అక్కినేని నాగార్జున, అమల దంపతులు కూడా మాల్దీవ్స్ వెళ్లారు. నాగ్, అమల బీచ్‌లో విహరించారు. అమల నీళ్లల్లో ఉన్న పిక్స్ కూడా షేర్ చేశారు. ఈ ఫొటోలు అక్కినేని అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Amala Akkineni (@akkineniamala)

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సమంత కపుల్ కూడా ఇటీవల మాల్దీవ్స్‌లో సందడి చేశారు. చైతు బర్త్‌డే సందర్భంగా అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.

Chai - Samantha

ఇక సినిమాల విషయానికొస్తే.. ‘కింగ్’ నాగ్ ‘వైల్డ్ డాగ్’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అంటూ జూన్ 19న రాబోతున్నాడు. చైతు ‘లవ్ స్టోరీ’ తో ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ప్రస్తుతం ‘థ్యాంక్యూ’ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు నాగ చైతన్య.

Wild Dog

Love Story

Most Eligible Bachelor