Akshay Kumar : బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు.. ఇక వరుస సీక్వెల్స్.. ఇప్పుడైనా హిట్ కొడతాడా అక్షయ్

హిస్టారికల్, ఎమోషనల్, యాక్షన్, థ్రిల్లర్, మైథలాజికల్... ఈ జానర్స్ అన్నింటినీ ఈ సంవత్సరం వచ్చిన 5 సినిమాల్లో చూపించారు అక్షయ్. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. అందేకే ఇక చేసిన ప్రయోగాలు చాలు మన హిట్ ఫార్ములా అయిన కామెడీనే నమ్ముకుందామని ..............

Akshay Kumar : బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు.. ఇక వరుస సీక్వెల్స్.. ఇప్పుడైనా హిట్ కొడతాడా అక్షయ్

akshay kumar ready to plan sequle movies

Akshay Kumar :  బాలీవుట్ హిట్ మెషీన్ ఈమధ్య వరస ఫ్లాపులతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఎప్పుడూ హిట్ మెషీన్ లా సక్సెస్ లు కొట్టడమే తెలిసిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సంవత్సరం రిలీజ్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అన్ని సినిమాలూ ఫ్లాపే కదా ఇప్పుడప్పుడే సినిమా చెయ్యడేమో అనుకున్నారంతా. కానీ అక్షయ్ అంత టైమ్ వేస్ట్ చేస్తాడా..? అందుకే తనకు బాగా కలిసొచ్చిన సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

బాలీవుడ్ హిట్ మెషీన్ అక్షయ్ కుమార్ బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ తో డిజాస్టర్లు ఫేస్ చేస్తున్నాడు. మినిమం గ్యారంటీ హీరోగా పేరున్న అక్షయ్ కుమార్ ఈ సంవత్సరం రిలీజ్ చేసిన బచ్చన్ పాండే, పృద్విరాజ్, రక్షాబందన్, కట్ పుత్లి, రామ్ సేతు ఇలా వరసగా ఫ్లాపులతో కెరీర్ లో టఫ్ ఫేజ్ ఫేస్ చేస్తున్నారు. అయినా సరే స్పీడ్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. తాను చేస్తున్న సినిమాలు నచ్చడం లేదు అంటే ..తప్పకుండా మార్పులు చెయ్యాల్సిన టైమొచ్చింది అంటూ స్టేట్ మెంట్ ఇచ్చిన అక్షయ్ కొత్త సినిమాల అనౌన్స్ మెంట్ తో రెడీ అవుతున్నారు.

వరసగా ఫ్లాపులున్నా కానీ సినిమాల స్పీడ్ ని మాత్రం తగ్గించడం లేదు అక్షయ్. లేటెస్ట్ గా తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కామెడీ మూవీస్ కి సీక్వెల్స్ అనౌన్స్ చెయ్యబోతున్నారు. హేరాఫేరి3, వెల్ కమ్ 3, ఆవారా పాగల్ దీవానా కి సీక్వెల్ గా సినిమాలు చెయ్యడానికి రంగం సిద్దంచేస్తున్నారు. ఈప్రాజెక్ట్స్ కోసం అక్షయ్ ఆల్రెడీ ఎరేంజ్ చేసిన టీమ్ సినిమా కథ, ప్రీ ప్రొడక్షన్ విషయంలో బిజీగా ఉందని బాలీవుడ్ మీడియా టాక్.

Singer Sunitha Son Akash : సింగర్ సునీత కొడుకుని చూశారా?? త్వరలో హీరో కాబోతున్నాడు..

హిస్టారికల్, ఎమోషనల్, యాక్షన్, థ్రిల్లర్, మైథలాజికల్… ఈ జానర్స్ అన్నింటినీ ఈ సంవత్సరం వచ్చిన 5 సినిమాల్లో చూపించారు అక్షయ్. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. అందేకే ఇక చేసిన ప్రయోగాలు చాలు మన హిట్ ఫార్ములా అయిన కామెడీనే నమ్ముకుందామని డిసైడ్ అయ్యినట్టున్నారు అక్షయ్. అందుకే వరసగా సూపర్ ఫన్ ఎంటర్ టైనర్స్ కి సీక్వెల్స్ చెయ్యబోతున్నారు. ఆల్రెడీ అక్షయ్ ఓ మైగాడ్ 2, జాలీ ఎల్ ఎల్ బి3, హౌజ్ ఫుల్ 5 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇవి కాక ఇప్పుడు మరో మూడు సినిమాలకి సీక్వెల్స్ సిద్ధం చేస్తున్నారు. మరి ప్రయోగాలు ఇవ్వని సక్సెస్ లు సీక్వెల్స్ ఇస్తాయా అని ఆలోచిస్తున్నారు బాలీవుడ్ వర్గాలు. అక్షయ్ ఏ సీక్వెల్ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వస్తాడో చూడాలి.