Akshaya Tritiya: అక్షయ తృతీయ ఎఫెక్ట్.. బంగారం అమ్మకాల్లో రికార్డు

అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు జోరందుకున్నాయి. మంగళవారం ఒక్కరోజే రూ.15,000 కోట్లకు పైగా విలువైన బంగారం అమ్మకాలు జరిగాయి.

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఎఫెక్ట్.. బంగారం అమ్మకాల్లో రికార్డు

Akshaya Tritiya

Akshaya Tritiya: అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు జోరందుకున్నాయి. మంగళవారం ఒక్కరోజే రూ.15,000 కోట్లకు పైగా విలువైన బంగారం అమ్మకాలు జరిగాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా బంగారం అమ్మకాలు అనుకున్నంత స్థాయిలో జరగకపోగా, ఈ ఏడాది మాత్రం రికార్డు స్థాయిలో వ్యాపారం జరిగింది.

Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి? పురాణాలు ఏం చెబుతున్నాయి..

‘కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ)’ అంచనా ప్రకారం.. కోవిడ్ మొదలైనప్పటి నుంచి జువెలరీ వ్యాపారం ఊపందుకోవడం ఇదే మొదటిసారి. ‘‘కొంతకాలంగా మందగించిపోయిన బులియన్ మార్కెట్‌కు అక్షయ తృతీయ వల్ల ఊపొచ్చింది. ఒక్కరోజే దాదాపు రూ.15,000 కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయి. వ్యాపారుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. లైట్ జువెలరీకి ఈసారి డిమాండ్ పెరిగింది. బంగారంతోపాటు వెండి అమ్మకాలకు కూడా మంచి స్పందన వచ్చింది’’ అని సీఏఐటీ ప్రతినిధులు చెప్పారు. 2019లో 10 గ్రాముల బంగారం ధర రూ.32,700 ఉంటే, ఈ ఏడాది రూ.53,000 వరకు ఉంది.

akshaya tritiya : గోల్డ్ కొనేదెలా..

2019లో వెండి కిలో ధర రూ.38,350 ఉంటే, ఈ ఏడాది రూ.66,600 ఉంది. మూడేళ్లలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 2021లో మొత్తం 39.3 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటే, 2022లో మొదటి మూడు నెలల్లోనే 41.3 టన్నుల బంగారం దిగుమతి అయింది. 2019 అక్షయ తృతీయ సందర్భంగా రూ.10,000 కోట్ల బంగారం అమ్మకం జరిగితే, 2020లో కోవిడ్ కారణంగా రూ.500 కోట్ల బంగారం మాత్రమే అమ్ముడైంది. ఈ ఏడాది మాత్రం రూ.15,000 కోట్ల అమ్మకాలు జరగడం విశేషం.