Food Combinations: ఈ కాంబినేషన్ ఆహార ప‌దార్థాలు అస్స‌లు తీసుకోవ‌ద్దు

ఆరోగ్యంగా ఉండాలంటే స‌మ‌తుల ఆహారం తీసుకోవ‌డం చాలా ముఖ్యం. ఆధునిక ప్ర‌పంచంలో జీవ‌న శైలిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని వ‌ల్ల స్థూల‌కాయం, ఊబ‌కాయం, మ‌ధుమేహం వంటివి చిన్న వ‌య‌సులోనే మ‌న‌ల్ని చుట్టుముడుతున్నాయి.

Food Combinations: ఈ కాంబినేషన్ ఆహార ప‌దార్థాలు అస్స‌లు తీసుకోవ‌ద్దు

Food

Food Combinations: ఆరోగ్యంగా ఉండాలంటే స‌మ‌తుల ఆహారం తీసుకోవ‌డం చాలా ముఖ్యం. ఆధునిక ప్ర‌పంచంలో జీవ‌న శైలిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని వ‌ల్ల స్థూల‌కాయం, ఊబ‌కాయం, మ‌ధుమేహం వంటివి చిన్న వ‌య‌సులోనే మ‌న‌ల్ని చుట్టుముడుతున్నాయి. ఆయా స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారు బ‌రువు త‌గ్గ‌డానికి ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును త‌గ్గించుకోవ‌డానికి ఎలాంటి ఆహార ప‌దార్థాలు తీసుకోవాలి, ఎలాంటి కాంబినేష‌న్‌లో వాటిని తీసుకోవ‌ద్దో క‌చ్చితంగా తెలిసి ఉండాలి. కొన్ని ఆహార కాంబినేష‌న్‌ల‌కు దూరంగా ఉండాలి. లేదంటే బ‌రువు త‌గ్గ‌డం కోసం ప‌డ్డ శ్ర‌మ అంతా వృథా అవుతుంది. కొన్ని ఫుడ్ కాంబినేష‌న్‌లు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌రింత జ‌టిలం చేస్తాయ‌ని, బ‌రువు త‌గ్గాల‌న్న మీ ప్ర‌య‌త్నాల‌కు అడ్డుగా నిలుస్తాయ‌ని పోష‌కాహార, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

International Yoga Day: తాజ్‌ మ‌హ‌ల్‌, ఆగ్రా కోట స‌హా స్మార‌క చిహ్నాల్లో నేడు ప్ర‌వేశం ఉచితం

మాంసాన్ని ఆలుగ‌డ్డ‌లు లేదా బ్రెడ్‌తో క‌లిపి తింటే కార్బోహైడ్రేట్, ప్రొటీన్ల‌ను క‌లిపి తీసుకున్న‌ట్లే. ఈ కాంబినేష‌న్ ఆహారానికి దూరంగా ఉండాలి. ఈ రెండు ర‌కాల ఆహారం తీసుకున్న‌ప్పుడు శ‌రీరంలో ప్రొటీన్ కుళ్ళిపోవ‌డం, కార్బోహైడ్రేట్ పులియ‌పోవ‌డం వంటి ముప్పు ఉంటుంది. దీంతో అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. కార్బోహైడ్రేట్, ప్రొటీన్ల కోసం బీన్స్, అన్నాన్ని క‌లిపి తీసుకోవ‌చ్చు.

International Yoga Day: యోగా దినోత్సవంలో పాల్గొని ఆస‌నాలు వేసిన మోదీ

చాలా మంది టీని స్నాక్‌తో క‌లిపి తీసుకుంటారు. అయితే, ఆ అల‌వాటు మంచిది కాదు. ఆ అల‌వాటు ఉంటే బ‌రువు త‌గ్గాల‌న్న మీ ప్ర‌య‌త్నాల‌కు ఆటంకాలు ఏర్ప‌డతాయి. టీలో కెఫిన్ ఉంటుంది. దీన్ని ఇత‌ర ఆహార ప‌దార్థాల‌తో క‌లిపి తీసుకుంటే శ‌రీరం ఐర‌న్‌ను గ్ర‌హించే ప్ర‌క్రియ‌లో ఆటంకాలు ఏర్ప‌డ‌తాయి. దీంతో క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి.

President Election: రాష్ట్రపతి పేరును ప్రకటించనున్న ఎన్డీఏ

మ‌న దేశంలో చ‌పాతీ, కూర‌గాయలు, అన్నాన్ని మ‌ధ్యాహ్నం, రాత్రి వేళ‌ల్లో ఆహారంగా తీసుకుంటాం. అయితే, చ‌పాతి, అన్నంలో గ్లైసెమిక్‌ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. వాటిని ఒకేసారి తీసుకోవ‌డం మంచిది కాదు.

Google Co-Founder: బిల్‌గెట్స్, జెఫ్ బెజోస్ బాటలో సెర్జీబ్రిన్ దంపతులు.. ఏం చేస్తున్నారంటే..

సాధారణంగా ఆహారం తిన్నాక క‌డుపు నిండుగా ఉంటుంది. అయినా చాలా మంది ఆహారం తిన్న వెంట‌నే కేకులు, బిస్కెట్లు, ఐస్‌క్రీం, స్వీట్ సూపులు వంటివి తీసుకుంటారు. చ‌క్కెర అధికంగా ఉండే అటువంటి ఆహార ప‌దార్థాలు తింటే క‌డుపులో మ‌రింత ఒత్తిడి ప‌డుతుంది. ఆహారం తిన్నాక కాస్త స‌మ‌యం ఇచ్చాకే కేకులు, ఐస్‌క్రీం వంటివి తీసుకోవాలి. కొన్ని ప‌దార్థాలు తినగానే త్వ‌ర‌గా అరుగుతాయి. కొన్ని ప‌దార్థాలు జీర్ణం కావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. అటువంటి ప‌దార్థాల‌న్నింటినీ క‌లిపి ఒకేసారి తీసుకుంటే జీర్ణ వ్య‌వ‌స్థ‌కు ముప్పు. అంతేగాక‌, బ‌రువు త‌గ్గాల‌న్న మీ ప్ర‌ణాళిక ముందుకు సాగ‌క‌పోవ‌చ్చు. కార్బోహైడ్రేట్లు, చ‌క్కెర కాంబినేష‌న్‌లోని ఆహార ప‌దార్థాలు శ‌రీరానికి తీవ్ర న‌ష్టాన్ని క‌లుగ‌జేస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఆలు చిప్స్‌తో క‌లిసి కోకాకోలా వంటి పానీయం తీసుకోవ‌డం మంచిది కాదు.