SBI Customers: ఖాతాదారులకు అలెర్ట్‌.. కొన్ని సేవలకు అంతరాయం!

SBI Customers: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. భారతీయ స్టేట్ బ్యాంకు ఖాతాదారులకు ఓ హెచ్చరిక జారీచేసింది. తమ ఖాతాదారులకు చెందిన కొన్ని సేవలకు అంతరాయం ఏర్పడనుందని ప్రకటించింది. ఈ విషయాన్ని ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా వినియోగదారులకు తెలిపింది.

SBI Customers: ఖాతాదారులకు అలెర్ట్‌.. కొన్ని సేవలకు అంతరాయం!

Alert For Cbi Customers Interruption Of Some Services

SBI Customers: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. భారతీయ స్టేట్ బ్యాంకు ఖాతాదారులకు ఓ హెచ్చరిక జారీచేసింది. తమ ఖాతాదారులకు చెందిన కొన్ని సేవలకు అంతరాయం ఏర్పడనుందని ప్రకటించింది. ఈ విషయాన్ని ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా వినియోగదారులకు తెలిపింది. అంతర్గత నిర్వహణ చర్యల్లో భాగంగా పలు సర్వీసులకు అంతరాయం కలుగనుందని ఎస్బీఐ తెలిపింది.

సేవలకు కలిగిన అంతరాయంతో వినియోగదారుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎస్బీఐ పేర్కొంది. బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకటం జూలై 10వ తేదీన 22.45 గంటల నుంచి జూలై 11న 00.15 గంటల వరకు ఎస్బీఐ ఆన్‏లైన్ సేవలు అందుబాటులో ఉండవు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఎస్‏బీఐ నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు పనిచేయవు.

ఎస్బీఐ ఆన్‏లైన్ సేవల అంతరాయంతో పాటుగా ఎస్బీఐ తమ కస్టమర్లు ఆన్‏లైన్ అకౌంట్ల పాస్‏వర్డ్‏లను తరచూ మార్చుకుంటూ ఉండాలని సూచించింది. ప్రస్తుతం విచ్చలవిడిగా జరుగుతున్న ఆన్ లైన్ మోసాల బారినపడకుండా ఉండేందుకు ఆన్‏లైన్ అకౌంట్ల పాస్‏వర్డ్‏లను మార్చుకోవాలని.. కస్టమర్లు ఎప్పుడూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించింది.