Weather Update: అలెర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు!

తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటలలో వాయుగుండంగా మారే అవకాశం ఉండగా.. దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం..

Weather Update: అలెర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు!

Weather Update: తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటలలో వాయుగుండంగా మారే అవకాశం ఉండగా.. దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో నాలుగు రోజుల పాటు వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ ఆది, సోమవారాలలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Big Boss 5: బయటపడిన కాజల్‌ బండారం.. సరయు బూతులకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో పలు జిల్లాలలో ఆది, సోమవారాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించిన అధికారులు ఈ మేరకు ఎల్లో హెచ్చరిక కూడా జారీచేశారు. ఇక ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ బంగాల్, ఒడిశా తీరం వెంబడి గంటకు 55 -65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

Telugu Young Heros: యాక్షన్ మీద మోజు పడుతున్న రొమాంటిక్ హీరోలు

ఒడిశాతో పాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలోని మత్స్యకారులు బుధవారం వరకు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఎల్లో హెచ్చరిక జారీ చేయగా.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.