RRR సెట్‌లోకి సీత.. జక్కన్నతో పిక్స్ వైరల్..

  • Published By: sekhar ,Published On : December 7, 2020 / 12:53 PM IST
RRR సెట్‌లోకి సీత.. జక్కన్నతో పిక్స్ వైరల్..

Alia Bhatt joins RRR shoot : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ NTR కొమరం భీం, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘RRR- రౌద్రం రణం రుధిరం’..


లాక్‌డౌన్ త‌ర్వాత పునః ప్రారంభ‌మైన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే 50 రోజుల భారీ యాక్ష‌న్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌మొత్తం రాత్రి వేళ‌ల్లో షూట్ చేశారు. తాజాగా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ షూటింగులో జాయిన్ అయింది. అల్లూరి పక్కన సీత పాత్రలో నటిస్తోందామె.

Alia Bhatt

ఈ షెడ్యూల్‌లో అలియాపై కొన్ని సీన్స్‌తో పాటు ఒక పాట కూడా తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ట్యూషన్ పెట్టించుకుని మరీ అలియా తెలుగు నేర్చుకుందని, సొంతగా తనే డబ్బింగ్ చెప్పుకోనుందని తెలుస్తోంది. ప్రస్తుతం జక్కన్న, అలియా ముచ్చటించుకుంటున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Alia Bhatt