Ranbeer kapoor : ఈ సమ్మర్‌లో అలియాభట్ పెళ్లి??

గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న రణబీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ లని అందరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు అని అడుగుతున్నారు. వీరిద్దరూ కలిసి ఎక్కడ కనపడ్డా ఎదురయ్యే మొదటి ప్రశ్న పెళ్లి......

Ranbeer kapoor : ఈ సమ్మర్‌లో అలియాభట్ పెళ్లి??

Aliya

 

Ranbeer kapoor :  ఇటీవల బాలీవుడ్ లో పలు ప్రేమ జంటలు పెళ్లిళ్లు చేసుకున్నాయి. కత్రికా కైఫ్, విక్కీ కౌశల్ తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు ఇటీవల వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మౌని రాయ్ లాంటి టీవీ స్టార్లు కూడా పెళ్లిళ్లు చేసుకున్నారు. తాజాగా మరో బాలీవుడ్ ప్రేమ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

 

గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న రణబీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ లని అందరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు అని అడుగుతున్నారు. వీరిద్దరూ కలిసి ఎక్కడ కనపడ్డా ఎదురయ్యే మొదటి ప్రశ్న పెళ్లి గురించే. అయితే దీనికి సమాధానం వచ్చింది అని బాలీవుడ్ మీడియా అంటుంది. ఈ జంట ఏప్రిల్ చివర్లో లేదా మేలో వివాహం చేసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్‌ బాలీవుడ్ ఫేమస్ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రాకు పెళ్లి బట్టలు తయారు చేయమని చెప్పింది అంట. పెళ్ళికి, దానికి సంబంధించిన అన్ని ఈవెంట్స్ కి డ్రెస్ లు రెడీ చేయమని మనీష్ కి ఆర్డర్ ఇచ్చారంట రణబీర్ తల్లి. దీంతో ఈ సమ్మర్ లోనే వీరి పెళ్లి బాజా మోగనుంది అంటున్నారు సినీ వర్గాలు.

Rashmika Mandanna : ఆలోచనలు మారాలి అంటూ.. ఫిట్‌నెస్‌ విషయంలో రష్మిక సలహాలు..

తాజాగా అలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. అలాగే రణబీర్, అలియా కలిసి ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమా షూట్ లో ఉన్నారు. ఈ షూట్ గ్యాప్ లో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు ఈ జంట. దీంతో మరోసారి బాలీవుడ్ లో స్టార్ వెడ్డింగ్ జరగనుంది.