RRR : అలియా భట్‌ రీ ఎంట్రీ..

కోవిడ్ పాజిటివ్ రావడం, తర్వాత లాక్‌డౌన్‌తో షూటింగ్స్‌కి లాంగ్ గ్యాప్ ఇచ్చేసింది అలియా.. ఇప్పుడు మాత్రం.. నేను రెడీ.. మీదే లేట్ అంటూ షూటింగ్ షెడ్యూల్స్ స్పీడప్ చేసింది..

RRR : అలియా భట్‌ రీ ఎంట్రీ..

Alia Bhatt

RRR: ఇండియా మొత్తం ఇప్పుడిప్పుడే అన్‌లాక్ అవుతోంది. సినిమా వాళ్లు కూడా వన్ బై వన్ షూటింగ్స్‌కి రెడీ అవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా ఈ నెలలోనే షూటింగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరుస పెట్టి సినిమాల్ని లైన్లో పెట్టుకున్న అలియా.. బాలీవుడ్ సినిమాల్ని కంప్లీట్ చేసేదెప్పుడో..? ట్రిపుల్ ఆర్ షూట్‌లో జాయిన్ అయ్యేదెప్పుడో చూద్దాం.

Silakaa​ Lyrical Song : ‘చెలియో చెల్లకో అత్త తెచ్చిన కొత్త చీర నచ్చకో’.. చమన్ బ్రదర్స్ చితక్కొట్టారుగా..

బాలీవుడ్ షూటింగ్స్ మొదలెట్టేసింది. సౌత్‌లో కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న సినిమాల్ని కంప్లీట్ చెయ్యడానికి ఫుల్ ప్లానింగ్‌తో రెడీ అవుతున్నారు మేకర్స్. అలియా భట్ కూడా షూటింగ్‌కి రెడీ అనేసింది. కోవిడ్ పాజిటివ్ రావడం, తర్వాత లాక్‌డౌన్‌తో షూటింగ్స్‌కి లాంగ్ గ్యాప్ ఇచ్చేసింది అలియా.. ఇప్పుడు మాత్రం.. నేను రెడీ.. మీదే లేట్ అంటూ షూటింగ్ షెడ్యూల్స్ స్పీడప్ చేసింది.

ఇప్పుడిప్పుడే అన్‌లాక్ అవ్వడంతో షూటింగ్‌కి ఈ నెల 20 నుంచి అటెండ్ అవుతోంది అలియా భట్. ముందుగా సంజయ్ లీలా భన్సాలీ మూవీ ‘గంగూ భాయ్ కతియా వాడీ’ షూటింగ్ కంప్లీట్ చెయ్యడానికి ప్లాన్ చేసుకుంది అలియా. 30 జులై న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఈ సినిమాకు సంబంధించి అలియాకు ఇంకా 2 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుంది. అందుకే ఫస్ట్ ‘గంగూభాయ్’ ని కంప్లీట్ చేసి అప్పుడే మిగిలిన షూట్స్ ఫైనల్ చెయ్యబోతోంది.

Alia Bhatt : గంగూబాయిగా అలియా.. ప్రభాస్‌తో పోటీకి సై..

అలియా, సంజయ్ లీలాభన్సాలీ సినిమా కంప్లీట్ అయ్యాక.. ట్రిపుల్ ఆర్ సినిమాలో జాయిన్ అవ్వబోతోంది. ట్రిపుల్ ఆర్ కి సంబంధించి ఒక్క షెడ్యూల్ మాత్రమే కంప్లీట్ కంప్లీట్ చేసిన అలియా.. జులై ఫస్ట్ వీక్‌లో మిగిలిన సీన్స్ కంప్లీట్ చెయ్యబోతోంది. ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ చేసుకోమని రాజమౌళికి ఇన్ఫామ్ చేసిన అలియా భట్.. ట్రిపుల్ ఆర్ కి సంబంధించి తన పార్ట్‌ని సింగిల్ షెడ్యూల్‌లోనే కంప్లీట్ చెయ్యబోతోంది. ట్రిపుల్ ఆర్ కూడా అక్టోబర్ 13 న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జంటగా నటిస్తోంది అలియా భట్.