Thirumala Alipiri : అలిపిరి మెట్ల మార్గం మూసివేత మరో రెండు నెలలు పొడిగింపు

సెప్టెండర్ చివరి నాటికి పనులన్నీ పూర్తి చేసి అక్టోబరు లో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అలిపిరి మెట్ల మార్గాన్ని తిరిగి పునరుద్ధరించాలన్న ఆలోచనతో టిటిడి అధికారులు ఉన్నారు.

Thirumala Alipiri : అలిపిరి మెట్ల మార్గం మూసివేత మరో రెండు నెలలు పొడిగింపు

అలిపిరి మెట్ల మార్గం బ్రహ్మోత్సవాలకు సిద్ధం

Thirumala Alipiri : తిరుమలకు భక్తులు నడిచివెళ్ళే అలిపిరి మెట్ల మార్గాన్ని మరో రెండు మాసాల పాటు మూసివేయనున్నారు. మెట్లమార్గంలో భక్తుల సౌకర్యార్ధం ఏర్పాటు చేస్తున్న పైకప్పు నిర్మాణ పనులు కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా పరిస్ధితులు, లాక్ డౌన్ నేపధ్యంలో భక్తుల సంఖ్య తిరుమలకు తక్కువగా ఉండటంతో అలిపిరి మెట్ల మార్గంలో అభివృద్ధి పనులకు టిటిడి శ్రీకారం చుట్టింది.

వాస్తవానికి జూన్ 1 నుండి జులై 31వతేదిలోపు గానే ఈపనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈనేపధ్యంలోనే రెండు మాసాల పాటు మెట్ల మార్గాన్ని మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం పనులు పూర్తికాక పోవటంతో మరో రెండు మాసాల పాటు అలిపిరి మెట్ల మార్గాన్ని మూసే ఉంచాలని నిర్ణయించారు. సెప్టెండర్ చివరి నాటికి పనులన్నీ పూర్తి చేసి అక్టోబరు లో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అలిపిరి మెట్ల మార్గాన్ని తిరిగి పునరుద్ధరించాలన్న ఆలోచనతో టిటిడి అధికారులు ఉన్నారు.

ఇదిలా ఉంటే మెట్ల మార్గం ద్వారా కొండకు చేరుకోవాలనుకునే వారికి శ్రీనివాస మంగాపురం వైపు ఉన్న శ్రీవారి మెట్టు మార్గం అందుబాటులో ఉంది. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేసి బ్రహ్మోత్సవాల నాటికి భక్తులు అలిపిరి నడకదారిలో వచ్చేందుకు వీలుగా టిటిడి అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.