Lashkar Bonalu : సికింద్రాబాద్ లష్కర్‌ బోనాలకు సర్వం సిద్ధం

పోతురాజుల ఆటపాటలతో పాటు...అమ్మవారి రంగం వరకు అన్నీ ఘనంగానే జరుగుతాయి. రేపు జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వారం రోజుల ముందునుంచే భద్రతపై రివ్యూ చేశారు.

Lashkar Bonalu : సికింద్రాబాద్ లష్కర్‌ బోనాలకు సర్వం సిద్ధం

Lashkar Bonalu

Lashkar Bonalu : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించే సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. రేపు జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీఐపీల తాకిడి తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉండనుండటంతో.. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భాగ్యనగరంలో గోల్కొండ బోనాల తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఎంతో వైభవంగా జరుగుతాయి.

పోతురాజుల ఆటపాటలతో పాటు…అమ్మవారి రంగం వరకు అన్నీ ఘనంగానే జరుగుతాయి. రేపు జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వారం రోజుల ముందునుంచే భద్రతపై రివ్యూ చేశారు. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానుండటంతో… మూడు వేల మంది సిబ్బందితో పాటుగా వందకు పైగా కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు.

Ashada Bonalu 2022 : ప్రారంభమైన ఆషాఢ బోనాలు

ట్రాఫిక్ ఆంక్షలు విధించిన అధికారులు… భక్తులకు ఇబ్బందులు కల్గకుండా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అలాగే అన్ని శాఖల సమన్వయంతో అమ్మవారి ఆశీస్సులతో బోనాల జాతరను ఘనంగా నిర్వహించేందుకు అన్ని సిద్దం చేశారు. వాటర్ వర్క్స్ శాఖ ఆధ్వర్యంలో వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ సిద్దం చేశారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 3 ప్రాంతాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే మహంకాళీ అమ్మవారి దేవాలయానికి వెళ్లే ముఖద్వారాలను ప్రారంభించిన మంత్రి తలసాని పోతరాజుల మధ్య డాన్స్ చేసి బోనాలకు ముందే పండగలో మంచి జోష్ నింపారు. బంగారు బోనం సమర్పించారు. ఇక.. సోమవారం రోజు అమ్మవారి రంగం కార్యక్రమం ఉంటుంది.