Medaram Jatara : మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. కోటి మందికి పైగా భక్తులు హాజరయ్యే ఛాన్స్

జాతరలో తీసుకోవాల్సిన చర్యలు ఏర్పాట్లపై సీఎస్‌, డీజీపీ దిశానిర్దేశం చేశారు. రెండేళ్లకోసారి జరిగే జాతరలో ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Medaram Jatara : మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. కోటి మందికి పైగా భక్తులు హాజరయ్యే ఛాన్స్

Medaram (1)

Medaram Jatara : తెలంగాణకే తలమానికమైన మేడారం జాతర ఏర్పాట్లపై ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. ఈ నెల 16న ప్రారంభం కానున్న జాతర నాలుగు రోజుల పాటు జరుగనుంది. జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో సీఎస్‌ సోమేష్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీసు, రెవెన్యూ, గిరిజన, దేవాదాయ, వైద్య, ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, పశు సంవర్థక శాఖ, ఆర్‌ అండ్ బీ, ఇరిగేషన్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

జాతరలో తీసుకోవాల్సిన చర్యలు ఏర్పాట్లపై సీఎస్‌, డీజీపీ దిశానిర్దేశం చేశారు. రెండేళ్లకోసారి జరిగే జాతరలో ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది జాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని చెప్పారు సీఎస్ సోమేశ్ కుమార్. జాతరకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు రావొద్దని.. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయాలని ఆదేశించారు. ఇవాళ ఉదయం జంపన్న వాగులోకి నీరు విడుదల చేశామని, దేవాదాయ, ఇంజినీరింగ్ విభాగాల పనులన్నీ దాదాపు పూర్తి కావొచ్చాయని తెలిపారు.

Polytechnic Exams : తెలంగాణలో పాలిటెక్నిక్‌ పరీక్షలపై లీకేజ్‌ ఎఫెక్ట్‌.. 8,9న జరిగిన ఎగ్జామ్స్ రద్దు

మేడారం ఆలయ పూజారులు, ట్రస్టు బోర్డు సభ్యులతో కలసి పనిచేయాలని, భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకొని క్షేమంగా వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అటు ఆర్టీసీ 3 వేల 850 బస్సుల ద్వారా 21 లక్షల మంది ప్రయాణికులను చేరవేసేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. జాతరలో తాత్కాలికంగా ఆస్పత్రిని నిర్మించామని, 35 హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

టాయిలెట్లకు ఇబ్బందులు కలగకుండా 327 లొకేషన్లలో 6,700 టాయిలెట్లు ఏర్పాటు చేసినట్లు సీఎస్ తెలిపారు. ఫుడ్ సెఫ్టీ అధికారులను నియమించామని, రోడ్ల నిర్మాణం, మరమత్తులు పూర్తయ్యాయని తెలిపారు. స్నాన ఘట్టాల ఏర్పాటుతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా, నీరు కాలుష్యం కాకుండా నిరంతరం క్లోరినేషన్ చేయనున్నట్లు చెప్పారు. నిరంతర కరెంటు సరఫరా, అదనపు సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

CM KCR : ‘మీ బెదిరింపులకు భయపడం’.. మోదీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఫైర్

18 ప్రాంతాల్లో తప్పిపోయిన పిల్లల క్యాంపులు ఏర్పాటు చేశామని, శానిటేషన్ పర్యవేక్షణకు 19 జిల్లాల పంచాయితీ రాజ్ అధికారులను నియమించారు. పంచాయితీ రాజ్ శాఖ నుంచి 5 వేల మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. బందోబస్తు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, తొక్కిసలాట కాకుండా గతంలో అనుభవం ఉన్న పోలీస్ అధికారులను విధుల్లో నియమించామని తెలిపారు.

దాదాపు 9 వేల మంది పోలీసులను నియమించామని.. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసామని.. జాతర మొత్తం అనువనువునా నిఘా ఉంచినట్లు డీజీపీ ప్రకటించారు. ఈనెల 19న జాతర ముగుస్తుందని విజయవంతంగా జాతరను ముగిస్తామని డీజీపీ స్పష్టం చేశారు.