Arvind Kejriwal : గుజరాత్‌ ప్రజలకు కేజ్రీవాల్ హామీలు..బీజేపీ నేతలపై పంచ్ లు

గుజరాత్‌ ప్రజలకు కేజ్రీవాల్ హామీలు కురిపించారు. ఈ ఏడాదిలో గుజరాత్ లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఆప్ యత్నాలు చేస్తోంది. దీంతో గుజరాత్ ప్రజలకు హామీలతో పాటు ..బీజేపీ నేతలపై పంచ్ లు కూడా వేశారు కేజ్రీవాల్.

Arvind Kejriwal : గుజరాత్‌ ప్రజలకు కేజ్రీవాల్ హామీలు..బీజేపీ నేతలపై పంచ్ లు

Gujarat Up To 300 Units Of Electricity Free Per Said Arvind Kejriwal

Arvind Kejriwal : ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ పార్టీగా దూసుకుపోతోంది. పంజాబ్ ఎన్నికల తరువాత మరింతగా దూకుడు పెంచింది. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ పై ఆప్ కన్నేసింది. గుజరాత్ లో గెలిచి అధికారం చేపట్టటానికి యత్నాలు చేస్తోంది. వచ్చే డిసెంబర్ లో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆప్ ఇప్పటినుంచే గుజరాత్ ప్రజల్ని ఆకట్టుకునే యత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగానే ఆప్ చీఫ్ అరవింత్ కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు.సూర‌త్ లో గురువారం (జులై 21,2022) విలేఖరులతో కేజ్రీవాల్ మాట్లాడుతూ..గుజరాత్ లో ఆప్ ను గెలిపిస్తే గృహ వినియోగదారులందరికీ నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.

‘గృహ వినియోగదారులందరికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తాం. అన్ని నగరాలు, గ్రామాల్లో 24 గంట‌లు నిరంత‌రాయంగా క‌రెంట్ స‌ర‌ఫ‌రా చేస్తాం అని’ అని అర‌వింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. గుజరాత్ లో ఆప్ ను గెలిపిస్తే..డిసెంబర్ 31, 2021 వరకున్న‌ అన్ని పాత విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తామని ప్ర‌క‌టించారు. గుజ‌రాత్‌లో తాము అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల కోసం ఏంచేస్తాం అనేది ఎజెండా రూపంలో చెబుతామని స్ప‌ష్టం చేశారు.

మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ ప్రజలకు హామీలతో పాటు బీజేపీ నేతలకు అద్దిరిపోయే పంచ్ లు కూడా ఇచ్చారు. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేజ్రీవాల్ పర్యటనకు ముందు గుజరాత్ బీజేపీ యూనిట్ చీఫ్ సీఆర్ పాటిల్ మాట్లాడుతూ..ప్ర‌జ‌లు మిఠాయి సంస్కృతి (రేవ‌డి క‌ల్చ‌ర్‌)కి అల‌వాటుప‌డి తప్పుదారి పట్టవద్దని సూచించారు. ఇటువంటి సంస్కృతి రాష్ట్రంతో పాటు..భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలాగా మార్చివేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. వారం క్రితం ప్రధాని మోదీ కూడా దాదాపు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు కేజ్రీవాల్ అదిరిపోయే పంచ్ ఇచ్చారు. మిఠాయిని ప్ర‌జ‌ల‌కు ఉచితంగా పంపిణీ చేస్తే దాన్ని ప్ర‌సాదం అంటార‌ని, కానీ సొంత స్నేహితులు, మంత్రుల‌కు ఉచితంగా ఇచ్చిన‌ప్పుడు దాన్ని పాపం అని అంటార‌ని చ‌లోక్తి విసిరారు. రేవ‌డి అనేది ఉత్తర భారతదేశంలో పండుగల సమయంలో ప్రత్యేకంగా పంపిణీ చేసే ఒక ప్రసిద్ధ స్వీట్.