Tollywood Films: అందరి చూపు టాలీవుడ్ పైనే.. ఒక్క ఛాన్స్ అంటున్న నేషనల్ స్టార్స్!

నిన్నమొన్నటివరకు అందరి గోల్ బాలీవుడ్. కానీ ఇప్పుడు.. టార్గెట్ టాలీవుడ్. ఇక్కడ ప్రూవ్ చేసుకుంటే చాలు అన్నట్టు అన్నీ ఇండస్ట్రీల నుంచి హీరోలొచ్చేస్తున్నారు.

Tollywood Films: అందరి చూపు టాలీవుడ్ పైనే.. ఒక్క ఛాన్స్ అంటున్న నేషనల్ స్టార్స్!

Tollywood Films

Tollywood Films: నిన్నమొన్నటివరకు అందరి గోల్ బాలీవుడ్. కానీ ఇప్పుడు.. టార్గెట్ టాలీవుడ్. ఇక్కడ ప్రూవ్ చేసుకుంటే చాలు అన్నట్టు అన్నీ ఇండస్ట్రీల నుంచి హీరోలొచ్చేస్తున్నారు. తమిళ, మలయాళీ, కన్నడ, బాలీవుడ్ స్టార్స్ సైతం ఒక్క సినిమా అంటున్నారు. తెలుగు సినిమాపై విపరీతంగా ప్రేమ పెంచేసుకుంటున్నారు. మహానటితో డైరెక్ట్ తెలుగు ఎంట్రీ ఇచ్చిన దుల్కర్‌.. నేషనల్ స్టార్ అనిపించుకునేందుకు బాగా ట్రై చేస్తున్నాడు. బాలీవుడ్ లోనూ అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు. పెద్దగా లాభం లేదనుకుని మళ్లీ టాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు దుల్కర్. లెఫ్ట్ నంట్ రామ్ అనే పీరియాడికల్ ఫిల్మ్ వీళ్ల కాంబోలో రాబోతుంది. బిగ్ ప్రొడక్ష్ హౌజ్ వైజయంతీ మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Film Controversies: మనోభావాలు దెబ్బతింటున్నాయ్.. కాంట్రవర్సీలు పుట్టుకొస్తున్నాయ్!

టాలీవుడ్‌కు హాయ్‌ చెబుతున్నాడు మరో మలయాళ యాక్టర్ దేవ్‌ మోహన్‌. గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత టైటిల్‌ రోల్‌ చేస్తోన్న శాకుంతలంలో దేవ్‌ మోహన్‌ మెయిన్‌ లీడ్‌గా చేస్తున్నాడు. సామ్ పాన్ ఇండియా ఫిల్మ్ యశోదతో పాటూ రవితేజ ఖిలాడిలోనూ ఉన్ని ముకుందన్ నటిస్తున్నాడు. అటు ప్రభాస్ సలార్ లో పృధ్వీరాజ్ సుకుమారన్ కీ క్యారెక్టర్ చేస్తున్నాడంటూ ఈమధ్య న్యూస్ బాగా వైరలయింది. పుష్ప 1లో కాసేపు కనిపించిన ఫహాద్ ఫాజిల్… పుష్ప2లో భీభత్సం సృష్టిస్తారనే టాక్ ఉంది.

Pushpa-Samantha: సామ్ ఊ అంటావా.. ఫుల్ సాంగ్ వచ్చేసింది!

కన్నడ స్టార్స్ కూడా టాలీవుడ్ లో స్పాట్ పెడుతున్నారు. అక్కడ మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న దునియా విజయ్‌ టాలీవుడ్‌ కు వస్తున్నారు. బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని కాంబో మూవీలో దునియా విజయ్‌ విలనిజం చూపిస్తాడని మేకర్స్ పోస్టర్ రివీల్ చేశారు. ఇప్పటికే పుష్ప మూవీతో ధనుంజయ్, నయీండైరీస్ తో వశిష్ట సింహా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక కన్నడ స్టార్ సుదీప్ మంచి ఛాన్స్ దొరికనప్పుడల్లా నో చెప్పకుండా తెలుగు సినిమాలు చేస్తూనే ఉంటారు.

South Stars: బాలీవుడ్‌లో జెండా పాతేస్తున్న లోకల్ స్టార్స్!

ఇక బాలీవుడ్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా అంటే ఇండియన్ సినిమా అని డైరెక్ట్ గానే ఒప్పేసుకుంటున్నారు. టాలీవుడ్ హీరోల సినిమాలను ప్రొడ్యూస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడి హీరోలు, ఇక్కడి డైరెక్టర్స్ తో వర్క్ చేయాలనుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ లాంటి హీరో చిరూతో గాడ్ ఫాదర్ మూవీలో స్టెప్పులేయబోతున్నాడు. గనిలో సునీల్ శెట్టి చేస్తున్నాడు. ప్రాజెక్ట్ కేలో అమితాబ్ నటిస్తున్నారు. ట్రిపుల్ ఆర్, ఆదిపురుశ్ లాంటి సినిమాల్లో బాలీవుడ్ స్టార్స్ నటించారు. అవకాశం వస్తే టాలీవుడ్ సినిమాల్లో కనిపించేందుకు సిద్ధమని రణ్ బీర్ కపూర్ లాంటి వాళ్లు ప్రకటించారు కూడా.