Sudigali Sudheer: అల్లు అరవింద్ చేతులమీదుగా కాలింగ్ సహస్ర టీజర్ లాంఛ్

బుల్లితెర నుండి వెండితెరపైకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే సక్సెస్‌ను అందుకోగా, మిగతా వారు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా....

Sudigali Sudheer: అల్లు అరవింద్ చేతులమీదుగా కాలింగ్ సహస్ర టీజర్ లాంఛ్

Allu Aravind Launches Sudigali Sudheer Calling Sahasra Teaser

Sudigali Sudheer: బుల్లితెర నుండి వెండితెరపైకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే సక్సెస్‌ను అందుకోగా, మిగతా వారు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మిగిలిపోయారు. కాగా ఇటీవలకాలంలో బుల్లితెరపై స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉన్నవారిలో సుడిగాలి సుధీర్ పేరు ముందు వరుసలో ఉంటుంది. తనదైన ఎనర్జిటిక్ యాంకరింగ్, ఆకట్టుకునే కామెడీ టైమింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు ఈ యాక్టర్. అయితే సుడిగాలి సుధీర్ వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

Sudigali Sudheer: పెళ్లి కొడుకైన సుధీర్.. అసలు నిజమేంటంటే?

కాగా తాజాగా మరో సినిమాతో హీరోగా ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నాడు సుడిగాలి సుధీర్. ఔట్ అండ్ ఔట్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘కాలింగ్ సహస్ర’ అనే సినిమాతో సుధీర్ ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆడియెన్స్‌లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో నటుడు శివ బాలాజీ కూడా నటిస్తుండటం, పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలు ఈ మధ్య కాలంలో రాకపోవడంతో.. ‘కాలింగ్ సహస్ర’ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

దర్శకుడు అరున్ విక్కిరాల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని విజేశ్ కుమార్, వెంకటేశ్వర్లు, చిరంజీవి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మోహిత్ సంగీతం అందించిన ఈ సినిమాలో డాలీషా హీరోయిన్‌గా నటిస్తోండగా,ఈ సినిమాను అతిత్వరలో ప్రేక్షకుల మందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో సుడిగాలి సుధీర్ హీరోగా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.