Allu Aravind : ‘లావణ్య భర్త చనిపోయి ఏడుస్తుంటే కార్తికేయ వెళ్లి ఆమెని గోకుతాడు’.. అరవింద్ గారు స్పీచ్ అదరగొట్టారుగా..

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా కొత్త దర్శకుడు కౌశిక్ తెరకెక్కించిన ‘చావు కబురు చల్లగా’ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా వైజాగ్‌లో గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Allu Aravind : ‘లావణ్య భర్త చనిపోయి ఏడుస్తుంటే కార్తికేయ వెళ్లి ఆమెని గోకుతాడు’.. అరవింద్ గారు స్పీచ్ అదరగొట్టారుగా..

Allu Aravind Chavu Kaburu Challaga

Allu Aravind: కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా కొత్త దర్శకుడు కౌశిక్ తెరకెక్కించిన ‘చావు కబురు చల్లగా’ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా వైజాగ్‌లో గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Chaavu Kaburu Challaga

మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘గీతా ఆర్ట్స్‌కు, వైజాగ్‌కు విడదీయరాని సంబంధం ఉంది. గతేడాది ఇక్కడ ఏ ఫంక్షన్ చేసామో అందరికీ గుర్తుంది కదా..! ‘సరైనోడు’, ‘గీత గోవిందం’ దగ్గర నుంచి ‘అల..వైకుంఠపురములో..’ దాకా అన్నీ వేడుకలు వైజాగ్‌లో జరిపాం. ఈ ఊరితో ఉన్న అనుబంధం అలాంటిది. ఎందుకంటే కొత్త కథలను కొత్త ఆలోచనలు ఆదరించే అలవాటు మీ అందరికీ ఉంది. ఇకపోతే ‘చావు కబురు చల్లగా’.. ఇది అసలు ఒక టైటిలేనా..? దర్శకుడు ఒక కథ రాసుకొని మీకు ‘చావు కబురు చల్లగా’ అని ఒక కథ చెబుతాను అన్నాడు. ఎవరైనా ‘చావు కబురు చల్లగా’ చెబుతారా.. కానీ దర్శకుడు ఈ సినిమాలో ఆ టైటిల్‌కు జస్టిఫికేషన్ ఇచ్చాడు..

Chaavu Kaburu Challaga

కార్తికేయ గురించి చెప్పాలి.. (నవ్వుతూ – నీకు మంచి ఫాలోయింగ్ ఉందయ్యా నీ పేరు చెప్పగానే అరుస్తున్నారు) కథలో తీయడానికి ఏం లేదు.. భర్త చచ్చిపోయి హీరోయిన్ ఏడుస్తుంటే కార్తికేయ వెళ్లి ఆయన ఎలాగూ లేడు.. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు. ఇలాంటి విచిత్రమైన కథ అనేక మలుపులు తిరుగుతూ ‘చావు కబురు చల్లగా’ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు కౌశిక్. కథ క్లైమాక్స్‌కి వచ్చేసరికి హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే బాగుండు అని ప్రేక్షకులతో అనిపించేలా తెరకెక్కించాడు దర్శకుడు.

Chaavu Kaburu Challaga

లావణ్య ఎంత అద్భుతమైన నటి అనేది అందరికీ తెలుసు.. ఈ సినిమాలో గ్లామర్ తక్కువగా ఉండే పాత్ర చేసింది. మరో మంచి తల్లి క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో. ఆమె ఇక్కడికి రాలేదు. మార్చి 19న మా సినిమా విడుదల అవుతుంది. ఒక మంచి సినిమా తీశాం. మీరందరూ థియేటర్లకి వచ్చి చూడండి. మీరు నా గురించి ఫాలో అయితే నేను అంత గబుక్కున ఏ సినిమా బాగుంది అని చెప్పను.. ఇది నేను చూశాను బాగుంది.. మీరు కూడా రేపు మార్చి 19న థియేటర్లకు వచ్చి చూసి ఎంజాయ్ చేయండి..’’ అన్నారు.