Allu Arjun Kids : ఫాదర్ ఫీలింగ్.. 15 రోజుల తర్వాత పిల్లలను చూడగానే ఎమోషనల్ అయిన బన్నీ..

ఇన్ని రోజులు పిల్లలకు దూరంగా ఉన్న బన్నీ.. ఈరోజు తన క్యూట్ కిడ్స్‌ను కలిశారు.. అయాన్‌ను చూడగానే.. ‘హాయ్.. ఐ యామ్ టెస్టెడ్ నెగిటివ్’ అంటూ గట్టిగా హగ్ చేసుకున్నారు..

Allu Arjun Kids : ఫాదర్ ఫీలింగ్.. 15 రోజుల తర్వాత పిల్లలను చూడగానే ఎమోషనల్ అయిన బన్నీ..

Allu Arjun Meeting His Family After Testing Negative And 15 Days Of Quarantine

Allu Arjun Kids: ముద్దుముద్దుగా సందడి చేసే ఇద్దరు క్యూట్ కిడ్స్, ఫాదర్ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ 15 రోజులపాటు పిల్లలను చూడ్డానికి వీలవకపోతే ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది? 15 రోజుల తర్వాత సడెన్‌గా పిల్లల్ని కలిస్తే ఆ ఆనందం ఎలా ఉంటుంది?.. మాటల్లో చెప్పలేని ఫీలింగ్ అది.. అనుభవిస్తేనే కానీ అర్థం కాదు..

Allu Arjun Tested Negative : అల్లు అర్జున్‌కు కోవిడ్ నెగిటివ్..

సరిగ్గా ఇదే పరిస్థితిని ఫేస్ చేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇటీవల తనకు కోవిడ్ సోకినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారాయన. 15 రోజులపాటు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. వైద్యుల సలమహాలు పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుని కోలుకున్నారు..

ఇన్ని రోజులు పిల్లలకు దూరంగా ఉన్న బన్నీ.. ఈరోజు తన క్యూట్ కిడ్స్‌ను కలిశారు.. అయాన్‌ను చూడగానే.. ‘హాయ్.. ఐ యామ్ టెస్టెడ్ నెగిటివ్’ అంటూ గట్టిగా హగ్ చేసుకున్నారు. తర్వాత గారాలపట్టి అర్హను కూడా హగ్ చేసుకుని పిల్లలిద్దర్నీ ముద్దులతో ముంచెత్తారు అల్లు అర్జున్.. కాగా ఈ సందడంతా బన్నీ సతీమణి స్నేహా రెడ్డి వీడియో తీశారు..