Allu Arjun : అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ సినిమా!.. వచ్చే జనవరిలో ప్రారంభం..

బన్నీ కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ.. కెరీర్‌ని ఫుల్ స్పీడప్ చేస్తున్నారు అల్లు అర్జున్. సుకుమార్‌తో చేస్తున్న ‘పుష్ప’ సినిమా ఆల్రెడీ 70 పర్సెంట్ కంప్లీట్ అయింది.. కొరటాలతో చెయ్యాల్సిన సినిమా తప్పిపోవడంతో నెక్ట్స్ సినిమా ఎప్పుడు ఎవరితో? అనే చర్చలు జరుగుతున్నాయి..

Allu Arjun : అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ సినిమా!..  వచ్చే జనవరిలో ప్రారంభం..

Allu Arjun

Allu Arjun: బన్నీ కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ.. కెరీర్‌ని ఫుల్ స్పీడప్ చేస్తున్నారు అల్లు అర్జున్. సుకుమార్‌తో చేస్తున్న ‘పుష్ప’ సినిమా ఆల్రెడీ 70 పర్సెంట్ కంప్లీట్ అయింది.. కొరటాలతో చెయ్యాల్సిన సినిమా తప్పిపోవడంతో నెక్ట్స్ సినిమా ఎప్పుడు ఎవరితో? అనే చర్చలు జరుగుతున్నాయి.

Pushpa

అందరు హీరోలు వరుసగా సినిమాల్ని లైన్లో పెడుతున్నారు. కానీ బన్నీ మాత్రం ఇంత వరకూ నెక్ట్స్ సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ‘పుష్ప’ బ్యాలెన్స్ 30 పర్సెంట్ షూట్ కంప్లీట్ చేసి ఆగస్ట్‌కి రిలీజ్ చేసేస్తే ఇక బన్నీ ఖాళీయే. అందుకే నెక్ట్స్ సినిమా మీద కాన్సన్‌ట్రేట్ చేశారు.

అల్లు అర్జున్ నిజానికి కొరటాలతో సినిమా అనౌన్స్ చేశారు. ఆ సినిమా నెక్ట్స్ సంక్రాంతికి రిలీజ్ అని కూడా పోస్టర్ ఇచ్చారు. కానీ అంతలోనే కొరటాల ఎన్టీఆర్‌కు షిఫ్ట్ అవ్వడంతో ఇప్పుడు బన్నీ నెక్ట్స్ సినిమా గురించి టాపిక్ నడుస్తోంది. అయితే బన్నీ అంతకుముందే వేణు శ్రీరామ్‌తో ‘ఐకాన్’ సినిమా కమిట్ అయ్యారు. ఆల్ మోస్ట్ షూటింగ్ స్టేజ్ వరకూ వెళ్లిన ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. ‘వకీల్ సాబ్’ తో మళ్లీ బౌన్స్ అయిన వేణుతో ‘ఐకాన్’ ని స్టార్ట్ చేస్తున్నట్టు దిల్ రాజు అఫీషియల్‌గానే చెప్పారు. అయితే బన్నీ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

KGF Chapter 2

వేణు శ్రీరామ్‌తో ‘ఐకాన్’ సంగతి క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి సడెన్‌‌గా ప్రశాంత్ నీల్ లైన్లోకి వచ్చేశారు. ప్రజెంట్ ప్రభాస్‌తో ‘సలార్’ సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్ డిసెంబర్ నాటికి ఈసినిమా కంప్లీట్ చేసేస్తే.. ఇక జనవరి నుంచి బన్నీతో సినిమాని పట్టాలెక్కించొచ్చని ప్లాన్ చేస్తున్నారట.. స్టైలిష్ స్టార్‌కి కన్నడ లో మంచి మార్కెట్, ఫాలోయింగ్ కూడా ఉండడంతో పాన్ ఇండియా వర్కౌట్ అవుతుందని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇన్ని ఆప్షన్స్‌లో అల్లు అర్జున్ ఏ డైరెక్టర్‌తో తన నెక్ట్స్ సినిమా అనౌన్స్ చేస్తారో అని ఎదరుచూస్తున్నారు ఫ్యాన్స్..