Allu Arjun : ‘ఐకాన్’ లో అంధుడిగా అల్లు అర్జున్..!

‘పుష్ప’ రెండు పార్టులుగా రాబోతుండడంతో బ్యాలెన్స్ ఉన్న ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి చేశాక, ‘ఐకాన్’ కి షిఫ్ట్ అవబోతున్నారు బన్నీ..

Allu Arjun : ‘ఐకాన్’ లో అంధుడిగా అల్లు అర్జున్..!

Allu Arjun Playing Challenging Role In Icon Movie

Allu Arjun: ‘స్టైలిష్ స్టార్’ హీరోగా అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన ‘ఐకాన్’ ఆ తర్వాత అడ్రెస్ లేకుండా పోయాడేంటి అనుకుంటుండగా.. ఇటీవల డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్‌ని ‘ఐకాన్ స్టార్’ అని పిలుస్తూ మళ్లీ ఆ సినిమా సంగతి గుర్తు చేశారు. ‘పుష్ప’ రెండు పార్టులుగా రాబోతుండడంతో బ్యాలెన్స్ ఉన్న ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి చేశాక, ‘ఐకాన్’ కి షిఫ్ట్ అవబోతున్నారు బన్నీ.

రెండు సినిమాల (‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎమ్.సి.ఎ’) అనుభవం ఉన్న వేణు శ్రీరామ్‌కి ‘వకీల్ సాబ్’ రూపంలో పవర్‌స్టార్ బిగ్ బ్రేక్ ఇవ్వడం కూడా ‘ఐకాన్’ తిరిగి పట్టాలెక్కడానికి ప్లస్ అయ్యిందనే చెప్పాలి. వేణు ప్రస్తుతం స్క్రిప్ట్‌కి ఫైనల్ టచెస్ ఇస్తున్నారట. ఇప్పుడీ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.

Pushpa : ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్.. పది ‘కె.జి.యఫ్’ లతో సమానం.. బుచ్చిబాబు సెన్సేషనల్ కామెంట్స్..!

అదేంటంటే ‘ఐకాన్’ లో అల్లు అర్జున్ అంధుడిగా కనిపించబోతున్నారట. సాధారణంగా హీరోలు బ్లైండ్ క్యారెక్టర్స్ చెయ్యడం చాలా రేర్. మాస్ మహారాజా తన మార్క్ కామెడీతో ‘రాజా ది గ్రేట్’ లో అలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్‌తో మెప్పించారు.

సినిమా సినిమాకి కథ, క్యారెక్టర్, స్టైలింగ్ అండ్ డ్యాన్స్ పరంగా వేరియేషన్ చూపిస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న బన్నీ ‘ఐకాన్’ లో అంధుడిగా తప్పకుండా మెప్పిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు అని అంటున్నారు టాలీవుడ్ సినీ జనాలు.

Allu Arjun : మురగదాస్‌తో బన్నీ.. ఏకంగా ఏడు సినిమాలు లైనప్..!