Allu Arjun Pushpa: రెండు పార్టులుగా పుష్ప సినిమా.. ఇందులో నిజమెంత?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చనున్న సినిమా. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో రానున్న మూడవ సినిమా. బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా భారీ సినిమా కూడా పుష్పనే. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే పుష్ప సినిమా కోసం మెగా అభిమానులతో పాటు తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Allu Arjun Pushpa: రెండు పార్టులుగా పుష్ప సినిమా.. ఇందులో నిజమెంత?

Allu Arjun Pushpa

Allu Arjun Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చనున్న సినిమా. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో రానున్న మూడవ సినిమా. బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా భారీ సినిమా కూడా పుష్పనే. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే పుష్ప సినిమా కోసం మెగా అభిమానులతో పాటు తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ మరింత ఆసక్తిని పెంచడంతో పుష్ప గురించి ఏ చిన్న వార్త వినిపించినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. అలా వైరల్ అవుతున్న అంశమే పుష్ప సినిమా రెండు భాగాలుగా రాబోతుంది.

గతంలో సుకుమార్-బన్నీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఆర్య, ఆర్య-2. ఈ రెండు సినిమాల కథ పూర్తిగా విరుద్ధమైనా టైటిల్స్ మాత్రమే ఒకేలా పెట్టారు. కానీ, ఇప్పుడు పుష్ప ఒకే కథతో రెండు భాగాలుగా రూపొందించారని ప్రచారం జరుగుతుంది. సీక్వెన్స్ రూపంలో ఈ రెండు భాగాలు విడుదల చేయనున్నారని చెప్తున్నారు. ఇప్పటికే పుష్ప సినిమాను ఆగష్టు 13న విడుదల చేయనున్నట్లుగా తేదీ ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబరులో సినిమా విడుదల చేయాలని మేకర్స్ కొత్త టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

అయితే, ఇప్పుడు జరిగే ప్రచారం ప్రకారం అక్టోబరులో ఒక పార్ట్ విడుదల కానుండగా వచ్చే ఏడాది సంక్రాంతి సమయానికి రెండో భాగాన్ని విడుదల చేయనున్నట్లు చెప్తున్నారు. అంతేకాదు.. ఇందులో బన్నీ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని మరో ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు సినిమా యూనిట్ ఈ పుకార్లఫై ఎలాంటి ప్రకటన చేయకపోగా అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఇవేమీ నిజమని నమ్మే పరిస్థితి లేదు. బన్నీకి జోడిగా ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా నటిస్తుండగా మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, హరీష్ ఉత్తమన్, జగపతి బాబు వంటి భారీ క్యాస్టింగ్ ఈ సినిమాలో నటిస్తున్నారు.