అర్హా క్యూట్ వీడియో.. ‘బెండకాయ్, దొండకాయ్, నువ్వు నా గుండెకాయ్’..

అర్హా క్యూట్ వీడియో.. ‘బెండకాయ్, దొండకాయ్, నువ్వు నా గుండెకాయ్’..

Allu Arha: అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల ముద్దుల కుమార్తె అల్లు అర్హా ఇప్పటినుంచే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అర్హా క్యూట్ వీడియోలు, ఫోటోలు అభిమానుల్ని కట్టిపడేస్తున్నాయి. ఇటీవల అర్హా పింక్ లాంగ్ ఫ్రాక్‌తో గార్డెన్‌లో దిగిన ఫోటోని షేర్ చేసింది బన్నీ భార్య స్నేహా. ‘మై ప్రిన్సెస్’ అని పెట్టిన ఈ ఫోటోకి బన్నీ.. ‘సో క్యూట్’ అంటూ రీ ట్వీట్ చేశారు.

ఇక ఆదివారం అల్లు అర్జున్ తన గారాల పట్టి అర్హా క్యూట్ వీడియో ఒకటి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో యాడ్ చేశారు.. అర్హా ముద్దుముద్దుగా ‘‘బెండకాయ్, దొండకాయ్, నువ్వు నా గుండెకాయ్..’’ అని చెప్పింది. అర్హా మాటలకు బన్నీ పడి పడి నవ్వారు.

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

‘‘మిస్ యు అర్హా’’ అంటూ అల్లు అర్జున్ షేర్ చేసిన స్టోరీ వైరల్ అవుతోంది. అర్హ ముద్దు ముద్దు మాటలకు నెటిజన్లు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.