Allu Arjun : పుష్ప 1 తగ్గేదేలే.. పుష్ప 2 అస్సలు తగ్గేదేలే..

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ''నాకు తెలుసు మీరంతా పుష్ప 2 అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. దాని గురించి ఒకటే మాట చెప్తాను పుష్ప 1 తగ్గేదేలే అయితే పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. సినిమా.........

Allu Arjun : పుష్ప 1 తగ్గేదేలే.. పుష్ప 2 అస్సలు తగ్గేదేలే..

Allu Arjun spoke about pushpa 2 in Urvashivo Rakshasivo Success celebrations

Allu Arjun :  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా పెద్ద హిట్ అయి బన్నీని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. ఇక అప్పట్నుంచి అంతా పుష్ప పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పుష్ప సినిమా వచ్చి దాదాపు సంవత్సరం అయిపోతుంది. దీంతో పుష్ప 2 ఎప్పుడని ఫ్యాన్స్, ప్రేక్షకులు అడుగుతున్నారు.

ఇటీవలే పుష్ప 2 షూటింగ్ పనులు మొదలుపెట్టారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్నారు. తాజాగా అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా విడుదలయి మంచి విజయం సాధించడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేయగా అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప 2 సినిమా గురించి మాట్లాడాడు.

BiggBoss 6 Day 63 : మొత్తానికి గీతూ ఎలిమినేట్ అయిందిగా.. ఇనయాకి కౌంటర్ ఇచ్చిన నాగ్..

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ”నాకు తెలుసు మీరంతా పుష్ప 2 అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. దాని గురించి ఒకటే మాట చెప్తాను పుష్ప 1 తగ్గేదేలే అయితే పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. సినిమా వేరే లెవెల్ ఉంటుంది. కచ్చితంగా అందరికి నచ్చుతుంది. చాలా పాజిటివ్ గా ఉంటుంది అని ఆశిస్తున్నాను” అని అన్నారు. దీంతో బన్నీ పుష్ప 2 సినిమాపై మరింత కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో బన్నీ అభిమానులు లేట్ అయినా సరే ఈ సారి భారీ హిట్ కొట్టబోతున్నాం అని అంటున్నారు.