అల్లు శిరీష్ హానెస్ట్ స్పీచ్.. అదరగొట్టేశాడు..

అల్లు శిరీష్ హానెస్ట్ స్పీచ్.. అదరగొట్టేశాడు..

Love Life And Pakodi: క‌ల‌ర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై మ‌ధురా శ్రీధ‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌ణ లో రూపొందిన చిత్రం ‘‘ల‌వ్ లైఫ్ అండ్ ప‌కోడి’’.. కార్తిక్ బిమల్ రెబ్బ, సంచిత పొనాచ జంట‌గా న‌టించారు. జ‌యంత్ గాలి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేమ, పెళ్లి ఏ బంధమైనా తమ జీవితానికి బంధనం కాకూడదు, స్వేచ్ఛను అడ్డుకోకూడదు అనుకుంటున్నారు నేటి యువత. నో కమిట్ మెంట్స్, నో బుల్ షిట్స్, లెట్స్ కీపిట్ సింపుల్ అనేది వాళ్ల మాట. ప్రేమ కాదు, ఫ్రెండ్ షిప్ కాదు దాన్ని మించింది అంటూ ఈ బంధాలకు కొత్త పేర్లు పెడుతున్నారు యువత. ఇలాంటి యూత్ ఫుల్ అంశాలన్నీ చిత్రంలో ఉండబోతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘‘ల‌వ్ లైఫ్ అండ్ ప‌కోడి’’ సినిమా ఈ నెల 12న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను యంగ్ స్టార్ అల్లు శిరీష్ లాంఛ్ చేశారు.

ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ.. ‘‘థియేటర్స్ ఓపెన్ అయ్యాక ఆడియెన్స్ ఈ లెవెల్లో థియేటర్స్‌కు వచ్చి సినిమాలను ఎంకరేజ్ చేస్తారని అనుకోలేదు. మీరు ధైర్యంగా బయటకొచ్చి సినిమాలు చూడటం వల్లే మేము సంతోషంగా ఉండగలిగాం. నా ఆర్టికల్ చదివి దర్శకుడు సినిమా చేశారు అని చెప్పాక సంతోషంగా ఉంది. ఇండస్ట్రీకి కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో శ్రీధర్ గారు ముందుంటారు. ‘ఒక మనసు, దొరసాని, ఏబీసీడీ’ చిత్రాలతో కొత్త దర్శకులను తీసుకొచ్చారు. వెంకీ అట్లూరి, అడవి శేష్, సందీప్ కిషన్ లాంటి హీరోలను టాలీవుడ్‌లో పరిచయం చేసింది శ్రీధర్ గారే. శ్రీధర్ గారంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, కొత్త వాళ్లంటే రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ దాటి, వాళ్ల టాలెంట్ నమ్మి కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారు. ‘ఏబీసీడీ’ సినిమా బాగా ఆడి, డబ్బులొస్తే ఇంకా నాలుగైదు చిన్న చిత్రాలు చేసేవారు. ఈసారి సూపర్ హిట్ చిత్రంతో వస్తాం. ట్రైలర్ చూశాను చాలా నచ్చింది. మ్యారేజ్, లవ్ గురించిన విషయాలు నాకూ తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే నాకు పెళ్లి వయసు వచ్చింది. భాయ్ ఫ్రెండ్ అనేది బాగానే ఉంటుంది కానీ, హజ్బెండ్ అంటేనే భయంగా ఉంది. దర్శకుడు తన ఉద్యోగాన్ని వదిలి యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చారు అంటేనే సక్సెస్ వైపు అడుగు వేసినట్లు. మా తాతయ్య రామలింగయ్య గారు కూడా ఇలాగే ఊరు నుంచి సినిమాల్లోకి ధైర్యంగా వచ్చేశారు. సంచిత, కార్తీక్ బాగా నటించారు. ‘శ్రీకారం, ఏ1 ఎక్స్ ప్రెస్, గాలి సంపత్, జాతి రత్నాలు’ రిలీజ్ అవుతున్నాయి. అవి పెద్ద చిత్రాలు, వాటితో పాటు ‘లవ్ లైఫ్ అండ్ పకోడి’ చిత్రాన్ని కూడా మీరు ఆదరించాలి. సింగిల్ స్క్రీన్స్ కాకుండా మల్టీ ఫ్లెక్స్‌లో రిలీజ్ చేస్తుండటం శ్రీధర్ గారి తెలివైన ఆలోచన. నా కొత్త సినిమా వివరాలు త్వరలో చెబుతాను’’.. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డి మాట్లాడుతూ.. ‘‘లవ్ లైఫ్ అండ్ పకోడి’ సినిమా మార్చి 12 రిలీజ్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. పనిచేసిన వాళ్లకు సినిమా డిఫరెంట్‌గానే ఉంటుందని అనిపిస్తుంటుంది. ఇలాంటి లవ్ స్టోరీ సినిమా తెలుగులో చూడలేదని నేను గర్వంగా చెప్పగలను. హీరో హీరోయన్లు ఉంటారు. వాళ్ల మధ్య డిఫరెన్సెస్ వస్తాయి. మళ్లీ చివరలో కలుస్తారు. ఇదే సహజంగా మన సినిమాల్లో ఉంటుంది. కానీ మా చిత్రంలో హీరో హీరోయిన్లు కలవడం విడిపోవడం చివరకు కలవడం పూర్తిగా కొత్తగా ఉంటుంది’’.. అన్నారు.

మధురా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆర్నెళ్ల క్రితమే శిరీష్ గారి టైమ్ తీసుకున్నాను. ట్రైలర్ నచ్చితేనే రిలీజ్ చేయండి అని అడిగాను. ఆయన రావడం సంతోషంగా ఉంది. ఒక మంచి సినిమా విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ తప్పు చేయలేదు. ‘మెంటల్ మదిలో, మల్లీ రావా, పెళ్లి చూపులు’ వంటి చిత్రాల్లో నేను డిస్ట్రిబ్యూషన్‌లో ఇన్ వాల్వ్ అయ్యాను. ఆ సినిమాల విషయంలో నా జడ్జిమెంట్ తప్పు కాలేదు. గతంలో బాలచందర్ గారు హ్యూమన్ ఎమోషన్స్‌ను ఎలా చూపించారో మా చిత్ర దర్శకుడు అలా చూపించారు. ప్రతి వారం చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఓన్లీ మల్టీఫ్లెక్స్‌లో ‘లవ్ లైఫ్ అండ్ పకోడి’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. 70 మల్టీ ఫ్లెక్స్‌లో మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మనం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సింగిల్ థియేటర్ నుంచి ఆలోచన మార్చుకున్నప్పుడే చిన్న సినిమాకు మంచి జరుగుతుంది. చిన్న నిర్మాతలు కొత్తగా ఆలోచించాలి. థియేటర్‌కు వచ్చి ఆడియెన్స్ ఎలా సినిమాలు చూస్తున్నారో మనం చూస్తున్నాం. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేసే వారి దగ్గర నుంచే ఇలాంటి చిత్రాలు పుట్టుకొస్తాయి. ఇది చాలా స్పెషల్ రిలీజ్, రూల్స్ బ్రేక్ చేసి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. హానెస్ట్‌గా చేసిన ప్రయత్నం, మీకు తప్పకుండా నచ్చుతుంది’’.. అన్నారు.

దర్శకుడు జయంత్ గాలి మాట్లాడుతూ.. ‘‘మా కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చిన శిరీష్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా బడ్జెట్ చిన్నది కానీ నిజాయితీగా ఉంటుంది. మరే పెద్ద సినిమాకూ తీసిపోదు. అంత కష్టపడి జెన్యూన్‌గా చేశాం. నేను గతంలో యఎస్ లో జాబ్ చేశాను. ప్రతి ఇంట్లో సినిమా పిచ్చోళ్లు ఉంటారు. మా ఇంట్లో నాకు సినిమాలంటే ఇష్టం. నేను ఇవాళ ఇక్కడ ఉండేందుకు చాలా మంది స్ఫూర్తి నిచ్చారు. తెలుగు స్టార్స్ సినిమాలు ఎవరివి రిలీజ్ అయినా ఫస్ట్ డేనే చూసేవాడిని. మాది అనంతపురం, నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఫాంటసీ. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ పై ఇష్టం పెరిగి, నేనూ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. అల్లు శిరీష్ గారి ఒక ఆర్టికల్ చదివిన తర్వాత సినిమాల్లోకి రావాలని డెసిషన్ తీసుకున్నాను. యూఎస్ నుంచి కెమెరా పట్టుకుని హైదరాబాద్ వచ్చాను. నా భార్య జీవితంలో చూసిన మొత్తం సినిమాలు నాతో పెళ్లైన నెలలో చూసింది. వెంకట్, శ్రీధర్ సార్ నా జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది మాటల్లో చెప్పలేను. లవ్ అంటే హృదయం అని చూపిస్తారు. కానీ ప్రేమ అనే దానికి కూడా ఒక హార్ట్ ఉంటుంది. వెంకట్, శ్రీధర్ సార్ హార్ట్‌ల అంత విశాలంగా లవ్ హార్ట్ ఉంటుంది. అంత విశాలమైన లవ్ హార్ట్‌ను మేము ఈ ‘లవ్ లైఫ్ అండ్ పకోడి’ చిత్రంలో చూపించాం. పకోడీలో ఉన్నట్లు రకరకాల రుచులు సినిమాలో ఉంటాయి. మీ మనసును సినిమా తాకుతుందని నమ్ముతున్నాను’’.. అన్నారు.