‘అల్లుడు అదుర్స్’ అనిపించలేకపోయాడు..

‘అల్లుడు అదుర్స్’ అనిపించలేకపోయాడు..

Alludu Adhurs: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మానుయేల్ హీరో హీరోయిన్లుగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల్లుడు అదుర్స్’ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘రియల్ హీరో’ సోనూ సూద్ కీలక పాత్రలో నటించారు.

Alludu Adhurs

పండుగ సీజన్, పైగా లాక్‌డౌన్ తర్వాత థియేటర్లు రీ ఓపెన్ కావడంతో ‘క్రాక్’, ‘రెడ్’, ‘మాస్టర్’ సినిమాలతో పాటు ఈ సినిమా కూడా రిలీజ్ చేశారు.
సాంగ్స్, ప్రోమోస్ ఆకట్టుకున్నా థియేటర్లో మాత్రం ‘అల్లుడు అదుర్స్’ అనిపించలేకపోయాడని కలెక్షన్ రిపోర్ట్స్ చూస్తే తెలుస్తుంది అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు. వారి సమాచారం ప్రకారం ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

ఏపీ, తెలంగాణ : రూ. 7.55 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : రూ. 18 లక్షలు
ఓవర్సీస్ : రూ. 5 లక్షలు
టోటల్ : రూ. 7.78 కోట్లు
బ్రేక్ ఈవెన్ : రూ. 13 కోట్లు
రికవరీ : 60 శాతం
బాక్సాఫీస్ రిపోర్ట్ : యావరేజ్.