Alluri Statue: భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం

విగ్రహం ఏర్పాటు చేసే పరిసర ప్రాంతాల్లో అధికారులు సుందరీకరణ పనులు చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్లెక్సీలను క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

Alluri Statue: భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం

Alluri Statue

Alluri Statue: పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సోమవారం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. విగ్రహం ఏర్పాటు చేసే పరిసర ప్రాంతాల్లో అధికారులు సుందరీకరణ పనులు చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్లెక్సీలను క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం అల్లూరి విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు.

Rahul Narwekar: ‘మహా’ స్పీకర్‌గా రాహుల్ నార్వేకర్.. రేపు షిండే బల పరీక్ష

మరోవైపు సోమవారం నుంచి సంవత్సర కాలం పాటు అల్లూరి జయంతి ఉత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు క్షత్రియ సేవా సమితి ఏర్పాట్లు చేస్తోంది. అల్లూరి అడుగుజాడలు ఉన్న అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు ముందుకు వచ్చాయని క్షత్రియ సేవా సమితి, ఏపీ-తెలంగాణ అధ్యక్షులు రామరాజు తెలిపారు. మరోవైపు విశాఖ ఎయిర్ పోర్టుకు అల్లూరి పేరు పెట్టాలని, ఆయన పేరుతో ఒక నాణెం విడుదల చేయాలని, సీబీఎస్ఈ సిలబస్‌లో ఆయన పాఠ్యాంశాన్ని పొందుపర్చాలని క్షత్రియ సేవా సమితి మోదీని కోరింది.